మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం?

ఎవరైనా రైలు ఎక్కాలంటే పొరుగునే ఉన్న పశ్చిమ బెంగాల్ వెళ్లాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు భారతదేశంలో రైల్వేలైను లేని, రైలు కూత వినని రాష్ట్రం ఉందంటే ఆశ్చర్యంగా లేదూ. రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలవుతున్నా ఈ రాష్ట్రం ఏ రైల్వే వ్యవస్థతో అనుసంధానం కాలేదు. ఇక్కడ రవాణా మొత్తం రోడ్డుమార్గంద్వారానే జరుగుతోంది. 6 లక్షల జనాభా ఉన్న సిక్కిం రాష్ట్రంలో ప్రజలెవరికీ రైలెక్కే అదృష్టం లేదు.

పశ్చిమ బెంగాల్ వెళ్లాల్సిందే..

పశ్చిమ బెంగాల్ వెళ్లాల్సిందే..


ఎవరైనా రైలు ఎక్కాలంటే పొరుగునే ఉన్న పశ్చిమ బెంగాల్ వెళ్లాల్సి ఉంటుంది. సిలిగురి, జల్పాయ్ గురి రైల్వేస్టేషన్ల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వారు రాకపోకలు సాగిస్తున్నారు. సిక్కిం రాష్ట్రానికి ఇన్ని సంవత్సరాలుగా రైల్వే లైను లేకపోవడానికి భౌగోళిక పరిస్థితులే కారణం. ఈ రాష్ట్రంలో చాలావరకు అన్ని ప్రాంతాలు ఎత్తయిన పర్వతాలపై ఉంటాయి. ఇటువంటి క్లిష్టమైన ప్రాంతాల్లో రైల్వే లైను ఏర్పాటు చేయడానికి గతంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడలేదు. 2008లో పశ్చిమ బెంగాల్ ను సిక్కిం రాష్ట్రంతో కలిపేందుకు సివోక్-రాంగ్ పో రైలు మార్గం నిర్మాణం దిశగా అడుగులు పడ్డాయి. అయితే ఈ ప్రాంతం వన్యప్రాణులు సంచరించే అభయారణ్యాలు, కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో పాటు నిధుల కేటాయింపులో జాప్యం జరగడం కూడా ప్రాజెక్టుకు అనుమతులు రావడంలో ఆలస్యం జరిగింది.

త్వరలోనే రైలు కూత..

త్వరలోనే రైలు కూత..

2016 కల్లా అడ్డంకులు తొలగిపోవడంతో ఈ మార్గంలో పనులు వేగవంతమయ్యాయి. 2021కల్లా ప్రాజెక్టు పూర్తవుతుందనుకున్నప్పటికీ కరోనా కారణంగా సాధ్యపడలేదు. ఇప్పటికీ నిర్మాణాలు జరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్‌ నుంచి సిక్కిం రాష్ట్రాన్ని కలిపేలా సివోక్‌-రాంగ్‌పో రైల్వే మార్గం నిర్మాణం పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఐక్రాన్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ఈ పనులు చేస్తోంది. సివోక్‌-రాంగ్‌పో లైన్‌ పూర్తయితే రెండో దశలో గ్యాంగ్‌టక్‌కు రైళ్ల రాకపోకలు సాధ్యమవుతాయని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ రైల్వే లైను నిర్మాణానికి అనుమతి లభించడమే కఠినమైన ఆంక్షల మధ్య లభించింది.

పట్టాలపై సెన్సర్ల అమరిక

పట్టాలపై సెన్సర్ల అమరిక

ట్రాక్ పై రైళ్ల వేగం, పట్టాలపై వన్యప్రాణుల సంచారం తెలిసేలా సెన్సర్ల అమరికతోపాటు ఇతర రక్షణ చర్యలు తీసుకుంటూ పనులు చేయాలని కాంట్రాక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. గత కొన్ని సంవత్సరాలుగా సిక్కింలో రైల్వే వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి వస్తుందనే మాటలు వినపడుతున్నప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తమ రాష్ట్రంలో రైల్వే లైను వస్తుందని, రైల్వే స్టేషన్ వస్తుందని, రైలు కూత వింటామని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+