ఇటలీలో భారత విద్యార్థులపై దాడి: సమీక్షిస్తున్న సుష్మా

Subscribe to Oneindia Telugu

మిలాన్‌: ఇటలీలోని మిలాన్‌లో భారతీయ విద్యార్థులపై దాడి జరిగింది. ఈ మేరకు మిలాన్‌లో భారత కాన్సులేట్‌ వెల్లడించింది. అయితే విద్యార్థులు ఆందోళన చెందొద్దని, ఘటనపై విచారిస్తున్నామని తెలిపింది.

ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా స్పందించారు. 'దాడిపై అన్ని వివరాలను తెలుసుకున్నాను. విద్యార్థులు కంగారుపడొద్దు. వ్యక్తిగతంగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాను' అని సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు.

Indian student attacked in Italy's Milan; Swaraj monitoring situation

అంతకుముందు 'మిలాన్‌లో కొందరు భారతీయ విద్యార్థులపై దాడి జరిగినట్లు కాన్సులేట్‌కు నివేదికలు వచ్చాయి. అయితే దీనిపై మిగతా విద్యార్థులు ఆందోళన చెందవద్దు. ఘటన గురించి సంబంధిత అధికారులతో చర్చిస్తున్నాం' అని మిలాన్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తమ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

అయితే ఈ దాడులు ఎవరిపై, ఎందుకు జరిగాయో అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. భారత విద్యార్థులు బయటకు వెళ్లినప్పుడు ఒకరితో ఒకరు సంప్రదించుకోవాలని కాన్సులేట్‌ జనరల్‌ సూచించింది. విద్యార్థులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
External Affairs Minister Sushma Swaraj on Tuesday tweeted out about an Indian Students attacked in Milan city in Italy and that she is personally monitoring the situation.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి