వైరల్ వీడియో: అమెరికాలో అడ్డంగా దొరికిపోయిన భారతీయ విద్యార్థిని..!
ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం భారత్ నుంచి ఏటా అమెరికాకు వెళ్తుంటారు విద్యార్థులు. అమెరికా వెళ్లి డబ్బు సంపాదించడం ఓ కలగా పెట్టుకుంటారు. భారత్ నుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అయితే ఉన్నత చదువులకోసం భారత్ నుంచి అమెరికా వెళ్లిన ఓ అమ్మాయి.. అక్కడ ఓ స్టోర్ లో దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. స్టోర్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు వచ్చి యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
An Indian woman was arrested in the #US after allegedly attempting to leave a #TargetStore without paying for several items. When confronted by security, she reportedly pleaded, “I’m sorry, please, just this once!” — but officers refused to let her off.#shoplifting
— News9 (@News9Tweets) November 2, 2025
(Video… pic.twitter.com/VafAkOmsn7
భారత్ కు ఓ విద్యార్థిని అమెరికాలోని ఓ షాపులో చోరీకి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. స్టోర్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పు చేశాను.. ప్లీజ్ నన్ను వదిలేయండి.. అంటూ ఆ విద్యార్థిని పోలీసులను వేడుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. తాను దొంగతనం చేయలేదని.. డబ్బులు చెల్లించడం మర్చిపోయానని ఆ యువతి ప్రాధేయపడింది. అయితే ఆ పోలీస్ అధికారి మాత్రం ఆమె విషయాన్ని పట్టించుకోవడం లేదు.

తాను తప్పు చేశానని ప్లీజ్.. వదిలేయండి.. అని సదరు యువతి పోలీసులను ప్రాధేయపడగా వాళ్లు మాత్రం ఆమెను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవలకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలోనూ ఓ ఇద్దరు భారతీయ విద్యార్థినులు ఇలాగే ఓ స్టోర్ లో చోరీకి పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కావడంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. విదేశాలకు వెళ్లి భారత్ పరువు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. కొందరు మాత్రం ఆమెపై సానుభూతి చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications