సప్తగిరి ఎక్స్ప్రెస్ సహా తిరుపతి, చెన్నై రూట్ లో 27 వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు..!!
రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. రేణిగుంట జంక్షన్ లో జరుగుతున్న ఆధునీకరణ పనులతో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లింపు నిర్ణయం తీసుకుంది. రేణిగుంట రైల్వే స్టేషన్ యార్డ్ ఆధునీకరణలో భాగంగా రైలు మార్గాల అనుసంధానం చేపట్టింది. ఈ మేరకు నేటి నుంచి డిసెంబర్ 27 వరకు రోజు వారి రైళ్లతో పాటు వీక్లీ ట్రైన్స్ రద్దు చేసారు. అదే విధంగా దారి మళ్లించిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు.
తిరుపతికి వెళ్లే ప్రయాణీకులకు రైల్వే శాఖ బిగ్ అప్డేట్. చెన్నై తిరుపతి మధ్య కొత్త రైల్వే లైన్ అనుసంధాన పనుల్లో భాగంగా రైల్వే శాఖ కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయడం మరికొన్నింటిని దారి మళ్ళించడం చేస్తోంది. చెన్నై తిరుపతి మధ్య నడిచే సప్తగిరి ఎక్స్ప్రెస్ 27 రోజుల పాటు రద్దు చేసింది. ఇక కడప- అరక్కోణం, తిరుచానూరు- అరక్కోణం, చెన్నై- తిరుచానూరు, గూడూరు- రేణిగుంట, నెల్లూరు- రేణిగుంట మధ్య రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్లను 48 రోజులపాటు రద్దు చేసింది. ఇక తిరుపతి- విశాఖపట్నం మధ్య వారంలో మూడు రోజులపాటు నడిచే డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ను డిసెంబర్ 9 నుంచి 26 వరకు రద్దు చేసింది. ఇక తిరుచా నూరు నుంచి నాందేడ్, జల్నా, కాచిగూడ చర్లపల్లి మధ్య రాకపోకలు సాగించే వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ను రెండు రోజులు రద్దు చేసింది.

పలు రైళ్ల రద్దు.. దారి మళ్లింపు
కాగా.. రేణిగుంట మైసూర్ మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ ను డిసెంబర్ 11, 12, 18, 19, 25 తేదీల్లో రద్దు చేసిన రైల్వే అధికారులు తిరుపతి భువనేశ్వర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలును డిసెంబర్ లో ఎనిమిది రోజులపాటు రద్దు చేసింది. ఈ మేరకు డిసెంబర్ 12, 13, 14, 19 20, 21, 26, 27 తేదీల్లో తిరుపతి భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ అయింది. ఇక ముంబై నుంచి రేణిగుంట మీదుగా చెన్నై వెళ్లే రైళ్లను గుత్తి, అనంతపురం, ధర్మవరం మీదుగా నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అదే విధంగా గూడూరు నుంచి రేణిగుంట మీదుగా చెన్నై వెళ్లే రైళ్లను సూళ్లూరుపేట మీదుగా నడపనుంది. రేణిగుంట మీదుగా ముంబై, హౌరా, ఢిల్లీ, కన్యాకుమారి, చెన్నై, త్రివేండ్రం, బెంగళూరు, మైసూరుకు వెళ్లే రైళ్లను గుత్తి, ధర్మవరం మీదుగా నడవనున్నట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
