రాహుల్ తో టీపీసీసీ చీఫ్ భేటీ, కీలక నిర్ణయాలు..!!
తెలంగాణ కేంద్రంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయాలకు సిద్దం అయ్యారు. ఢిల్లీ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో జరిగే భారత్ సమ్మిట్‌కు రావాలని ఆయనను ఆహ్వానించారు. జాతీయస్థాయిలో ఓబీసీ అంశాలపై రాహుల్‌తో మహేశ్‌గౌడ్ చర్చించారు. అలాగే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలు, పార్టీ పరిస్థితులపైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాల పైన చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా, తెలంగాణలో ఓబీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం పై రాహుల్ గాంధీతో చర్చించినట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. భారత్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వెనుకబడిన తరగతులకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని రాహుల్‌కు వివరించినట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంస్థాగత కార్యక్రమాలను నివేదిక రూపంలో అందచేసారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై చర్చ జరిగిందని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు. నవంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే భారత్ సమ్మిట్‌కు రాహుల్ వస్తున్నట్లు మహేశ్ కుమార్ తెలిపారు. భారత్ సమ్మిట్‌తో పాటు గిగ్ వర్కర్ల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ సూచించారన్నారు.

నామినేటెడ్ పోస్టు భర్తీ పైనా స్పష్టత
కాగా, తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో వారితో సమావేశం నిర్వహించాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గిగ్ వర్కర్లను ఉద్దేశించి ఏఐసీసీ అగ్రనేత ప్రసంగించే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నిర్వహించనున్న సభపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు పీసీసీ చీఫ్ చెప్పారు. తెలంగాణలో మెగా బీసీ ర్యాలీ నిర్వహణకు ఆహ్వానించానని తెలిపారు. మంత్రులు, ఎంపీల మధ్య విభేదాలు, ఢిల్లీలో జరిగిన పరిణామాలపై ఏఐసీసీ అగ్రనేతతో సమావేశంలో చర్చ జరగలేదన్నారు. ఈ అంశాలను పార్టీ ఇన్ఛార్జ్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చూసుకుంటారని వెల్లడించారు. నవంబర్ చివరినాటికి తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని స్పష్టత ఇచ్చారు. సోనియాగాంధీ ఆత్మ కథ పుస్తకంపై తెలంగాణలో కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications
