వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

WHO ఆ పదం చేర్చలేదు.. మీడియాది తప్పుడు ప్రచారం, భయాందోళనలు వద్దు : కేంద్రం

|
Google Oneindia TeluguNews

B.1.617 అనే కరోనా వేరియంట్ భారత్‌కు చెందినదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని మీడియా కథనాల్లో తప్పుడు వార్తలు వచ్చాయని క్లారిటీ ఇచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ B.1.617 అనేది ఇండియన్ వేరియంట్ అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాల్లేవని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి కథనాలను ప్రసారం చేసేప్పుడు మీడియా సంస్థలు సంయమనం పాటించాలని కేంద్రం సూచించింది. అసలు B.1.617 అనేది ఇండియన్ వేరియంట్ అని డబ్ల్యూహెచ్ఓ ఎక్కడా పేర్కొనలేదని కేంద్రం వెల్లడించింది.

చాలా మీడియా సంస్థలు ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ B.1.617 ఇండియన్ వేరియంట్ అంటూ కథనాలను ప్రచురించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించిందని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. B.1.617 పై ప్రపంచ ఆరోగ్యసంస్థ విడుదల చేసిన 32 పేజీల డాక్యుమెంట్‌లో ఎక్కడా కూడా ఈ వేరియంట్ ఇండియన్‌ది అని చెప్పలేదని కేంద్రం స్పష్టం చేసింది. B.1.617 అనేది ఇండియాలోనే గుర్తించబడ్డ వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు చెప్పినట్లు మీడియా కథనాలను ప్రచురించింది. భారత్‌లో B.1.617 అనే కొత్త వేరియంట్‌ గుర్తించామని డబ్ల్యూహెచ్‌ఓ టెక్నికల్ లీడ్ డాక్టర్ మారియా వాన్ కెర్‌కోవ్ చెప్పారు. అదే సమయంలో ఇండియాలో గుర్తించబడ్డ వేరియంట్‌ ఇతర దేశాల్లో కూడా కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేసింది. అయితే దీనిపై స్పష్టత ఇచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

Indian variant word was never used by WHO, Centre rubbishes media reports on B.1.617 variant

వైరస్ లేదా వేరియంట్స్ ఆయా దేశాల పేర్లతో గుర్తించమని ... వాటిని శాస్త్రీయ నామంతోనే గుర్తిస్తామని అది అందరికీ సౌకర్యంగా ఉండేలా స్థిరమైన పేరునే వినియోగించాలని కోరుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్వీట్ చేసింది. B.1.617 వేరియంట్ గతేడాది అక్టోబర్‌లో భారత్‌లో గుర్తించామని ఆతర్వాత వ్యాప్తి వేగంగా చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం పేర్కొంది. ఇది 44 దేశాల్లో ఉందని చెప్పారు. అంతకుముందు బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో కూడా వేరియంట్‌ను గుర్తించామని చెప్పారు. B.1.617 వేరియంట్‌ డబుల్ మ్యూటెంట్‌గా పిలుస్తున్నామని చెప్పారు. ఈ జన్యుక్రమంలో రెండు మార్పులు జరిగాయని వివరించారు. సెకండ్ వేవ్ సమయంలో ఈ B.1.617 వేరియంట్ విపరీతంగా వ్యాప్తి చెంది చాలామందిని బలితీసుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

English summary
The government today objected to the labelling of the B.1.617 Covid variant as the "Indian variant", stressing that the word "Indian" was never used by the World Health Organisation (WHO).B.1.617
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X