‘ఆక్స్‌ఫర్డ్’కెక్కిన అన్నా, అచ్చా, అబ్బా!

ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ ఆంగ్ల నిఘంటువులో పలు భారతీయ పదాలను తాజాగా చేర్చారు. వీటిలో ప్రముఖంగా తెలుగు, ఉర్దూ, తమిళం, హిందీ, గుజరాతీ భాషలకు చెందిన పదాలు ఉండటం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా వినిపించే

లండన్: ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ ఆంగ్ల నిఘంటువులో పలు భారతీయ పదాలను తాజాగా చేర్చారు. వీటిలో ప్రముఖంగా తెలుగు, ఉర్దూ, తమిళం, హిందీ, గుజరాతీ భాషలకు చెందిన పదాలు ఉండటం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా వినిపించే 'అన్నా' పదానికి ఈసారి ఆంగ్ల నిఘంటువులో చోటు కల్పించారు.

తెలుగు, తమిళ భాషల్లో 'అన్నా' అంటే పెద్ద అన్నయ్య లేదా అన్నయ్య అని అర్థాలున్నాయి. ఇది వరకు కూడా ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో 'అన్నా' అనే పదం ఉంది. అయితే దానికి ఆరుపైసలు (తెలుగులో అణా) అని అర్థం ఉండేది.

Indian words go global: Anna, achcha! enter the Oxford dictionary

ఈసారి ఉర్దూ పదం అబ్బా (తండ్రి) పదాన్ని కూడా చేర్చారు. ఇంకా అచ్చా, బాపూ, బడాదిన్, బచ్చా, సూర్యనమస్కార్ వంటి పదాలను తాజా నవీకరణలో చేర్చారు. అచ్చా అనే పదం కూడా ఆ నిఘంటువులో ఇదివరకే సరే లేదా మంచిది అనే అర్థంతో ఉంది.

అయితే తాజాగా దానికి ఆశ్చర్యపోయే భావోద్వేగం అనే అర్థాన్ని జోడించారు. మనదేశంలోనే గాక, ప్రపంచ వ్యాప్తంగా ఆక్స్ ఫర్డ్ నిఘంటువును చాలా మంది అనువాదానికి ప్రమాణికంగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+