Maldives: భారతీయుల దెబ్బకు చుక్కలు చూస్తున్న మాల్దీవ్స్..

మాల్దీవ్స్ కు భారతీయులు చుక్కలు చూపిస్తున్నారు. అక్కడికి బుక్ చేసుకున్న టికెట్ల అన్నీ రద్దు చేసుకుంటున్నారు. తాజాగా భారతీయ ఆన్ లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ అనే మాల్దీవ్స్ విమాన టికెట్ల బుకింగ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆ కంపెనీ సీఈవో నిశాంత్ ఓ ప్రకట చేశారు. మాల్దీవ్స్ మంత్రుల వ్యాఖ్యలతో అసలు వివాదం మొదలైంది. సాధారణంగా భారత్ నుంచి మాల్దీవ్స్ భారీగా పర్యటకులు వెళ్తారు.

ఆ దేశానికి పర్యటకం నుంచే ఆదాయం వస్తుంది. సంవత్సరానికి రెండు లక్షల మంది భారత్ నుంచి మాల్దీవ్స్ వెళ్తుంటారు. తాజాగా భారత ప్రధాని లక్షద్వీపులో పర్యటించారు. అక్కడి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో చాలా మంది లక్షద్వీపు గురించి గూగుల్ లో సెర్చ్ చేశారు. దీంతో చాలా మంది లక్షద్వీపు వెళ్తారని భావించిన మల్దీవ్ మంత్రులు భారత్ పై అనుచిత వ్యాఖ్యాలు చేశారు.

Indians are canceling the tickets booked to Maldives

లక్షద్వీప్‌‌ను మోదీ ప్రమోట్ చేయడం వల్ల మాల్దీవులుపై పెద్ద దెబ్బ పడుతుందని, మాతో పోటీ పడాలనే ఆలోచన భ్రమ మాత్రమే. మేం అందించే సేవలను వారు ఎలా అందించగలరు? ఇంత శుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడ గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని ట్వీట్ చేశారు. దీంతో భారతీయులు తీవ్రంగా స్పందించారు. ఎక్స్‌‌ (ట్విట్టర్‌‌‌‌)లో 'బాయ్‌‌కాట్ మాల్దీవ్స్' హ్యాష్‌‌ట్యాగ్ ట్రెండ్ చేశారు.

భారతీయ సినీ, క్రికెట్ ప్రముఖులు కూడా ట్వీట్ చేశారు. మాల్దీవ్స్ బదులుగా లక్షద్వీప్ వెళ్లాలని సూచించారు. కొంత మంది భారతీయులైతే.. క్యాన్సల్ చేసుకున్న విమానం టికెట్ స్క్రీన్ షార్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 వేల హోటల్ బుకింగ్స్, 2500 ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను ఆ దేశ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయినప్పటికీ భారతీయుల దెబ్బతో మాల్దీవ్స్ ఇబ్బంది తప్పదని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+