బీజేపీ పాలనలో భారతీయుల మధ్య విభజన : మోదీపై రాహుల్ విసుర్లు
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో భారతదేశాన్ని రెండు దేశాలుగా విభజించారన్నారు. ఒకటి ధనవంతుల దేశం కాగా.. మరొకటి పేదల దేశమని రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఈ రెండు దేశాల మధ్య విభజన నానాటికీ పెరిగిపోతుందని పేర్కొన్నారు. దేశానికి సంబంధించిన ధనమంతా ఒకరిద్దరి చేతుల్లోకి బందీ అయిపోయిందని విమర్శించారు. పేదలకు సరైన ఉద్యోగాలు కూడా లేవని మండిపడ్డారు.

మోదీ ప్రభుత్వం ధనికుల కోసమే పనిచేస్తుంది..
రాష్ట్రపతి ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వం ధనికుల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. వారికే అన్ని సదుపాయాలు అందుతున్నాయన్నారు. కానీ పేదలకు గురించి ఈ కేంద్ర ప్రభుత్వ ఆలోచించడం లేదని విమర్శించారు. వీరికి ఆపన్న హస్తం అందించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం వలన ఈ ధనిక, పేద దేశాల మధ్య విజభన నానాటికీ పెరుతోందని పేర్కొన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ .. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఎన్టీయే పాలనలో 23 కోట్ల మంది పేదరికంలోకి..
దేశంలో కేవలం 10 మంది ధనవంతుల వద్ద ఉన్న నగదు.. దేశంలోని 40 కోట్ల మంది ప్రజల ఆదాయంతో సమానం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో ప్రజల జీవన ప్రమాణాలు తారుమారైయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. గత 50 ఏళ్లలో ఇంతటి నిరుద్యోగ సమస్య ఎప్పుడూ తలెత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ పాలనలో 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. కానీ, ఎన్డీయే హయంలో 23 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేశారని మండిపడ్డారు.

రైతులు, నిరుద్యోగులు, పేదల పట్ల నిర్లక్ష్యం
బీజేపీ పాలనలో దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుందని రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్‌లో రైతులు, నిరుద్యోగులు, పేదల గురించి ప్రస్తావనే లేదని విమర్శించారు. దేశంలోని యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంది. కానీ దాని గురించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలతో యువతను మోసం చేస్తుందని విరుచుకుపడ్డారు. ఉద్యోగాలు కల్పించడంతో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణలు గుప్పించారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను మోదీ ప్రభుత్వం విద్వంస చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications