కళ్లు జిగేల్‌మనిపిస్తున్న వందేభారత్ స్లీపర్

ప్రపంచంలోనే అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన రైల్వే వ్యవస్థలో నాలుగో స్థానంలో ఉన్న భారతీయ రైల్వే గతిని వందేభారత్ రైళ్లు మారుస్తాయని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. ఈ సిరీస్ లోనే వందేభారత్ స్లీపర్ బెర్త్ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వందేభారత్ రైళ్లు తక్కువ దూరం ఉన్న నగరాల మధ్య తిరుగుతుండగా, వందేభారత్ స్లీపర్ మాత్రం వెయ్యి కిలోమీటర్ల పైబడిన నగరాల మధ్య తిరగబోతున్నాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు ఇవి సిద్ధమవుతున్నాయి. తయారీ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్లీపర్ పై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు.

దీంతో మరిన్ని రైళ్లను తయారుచేయబోతున్నారు. దేశం మొత్తంమీద 14 మార్గాల్లో వీటిని నడిపే ఆలోచనలో రైల్వే ఉంది. భద్రతా ప్రమాణాలన్నీ అత్యాధునిక స్థాయిలో ఉన్నాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇవి తయారయ్యాయి.

India s first Vande Bharat sleeper train is amazing and interior is excellent

వందేభారత్ స్లీపర్ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారుచేశారు.తలుపులన్నీ ఆటోమేటిక్ పద్దతిలో తెరుచుకుంటాయి.. మూసుకుంటాయి.టాయ్ లెట్ల నుంచి ఎటువంటి దుర్వాసన రాదు. అందుకు ప్రత్యేక వ్యవస్థను ఉపయోగించారు.లోకోపైలెట్ తో మాట్లాడేందుకు ఆడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఒక్కో బెర్తు ఒక్కో రంగులో ఉంటుంది.కింద, పైన ఉండే బెర్తులు బూడిద రంగంలో ఉంటే, మధ్యలో ఉండే బెర్తు నారింజ రంగులో ఉంటుంది.బెర్తుల దగ్గర మొబైల్ ఫోన్లు పెట్టుకునే బాక్సులు, మ్యాగ జైన్ బ్యాగులు ఏర్పాటు చేశారు.బెర్తులు 6 అడుగుల పొడవుతో ఉంటాయి.

సెక్యూరిటీ, రైల్వే సిబ్బంది కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు.లోకో పైలెట్ల కోసం కూడా టాయ్ లెట్లను ఏర్పాటు చేశారు.బెర్తుల దగ్గర పుస్తకాలు చదువుకోవడానికి లైట్లు, యూఎస్ బీ ఛార్జింగ్ సౌకర్యం ఉంది.దివ్యాంగులకు సులభంగా ఉండేలా బెర్తులు రూపొందించారు.ప్రపంచస్థాయి ప్రమాణాలతో అగ్నినిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+