దేశ తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు?
Vice President: భారత 14వ ఉపరాష్ట్రపతిగా 2022 ఆగస్టు నుంచి సేవలందిస్తున్న జగదీప్ ధన్‌ఖర్ జులై 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజునే తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడంతో, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యింది. వాస్తవానికి, ఆయన పదవీకాలం 2027 ఆగస్టు 10న ముగియాల్సి ఉంది. ధన్‌ఖర్ తన రాజీనామాకు అధికారికంగా ఆరోగ్య కారణాలను పేర్కొన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో ఆయనకున్న విభేదాలే ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన విషయంలో ప్రభుత్వ వైఖరితో ఆయన ఏకీభవించకపోవడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయని సమాచారం.
జగదీప్ ధన్‌ఖర్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల కమిషన్ సెప్టెంబర్ 9న ఎన్నికలను నిర్వహించనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ స్పందించారు. దేశ తదుపరి ఉపరాష్ట్రపతిని అధికార పక్షమే నామినేట్ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

'ప్రతిపక్షంతోనూ సంప్రదింపులు ఆశిస్తున్నాం' - శశి థరూర్
తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారని మీడియా ప్రశ్నించినప్పుడు శశి థరూర్ మాట్లాడుతూ, "తదుపరి ఉపరాష్ట్రపతిని అధికార పక్షమే నామినేట్ చేస్తుందని మాకు తెలుసు. ఎందుకంటే ఎలక్టోరల్ కాలేజీ నిర్మాణం ముందే నిర్ణయించబడింది. అయితే ఈసారి ప్రతిపక్షంతోనూ సంప్రదింపులు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. కానీ అది ఇప్పుడే ఎవరు చెప్పగలరు?" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఉపరాష్ట్రపతి ఎన్నికలో సంప్రదాయాలను ప్రభుత్వం ఎంతవరకు పాటిస్తుందనే దానిపై శశి థరూర్ ఆశలను వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారో తనకు కచ్చితంగా తెలియదని, అయితే అది అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థే అవుతుందని స్పష్టం చేశారు. జగదీప్ ధన్‌ఖర్ తన పదవీకాలం 2027 వరకు ఉన్నప్పటికీ, జూలై 21న ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
'మెజారిటీ అధికార పక్షానిదే, ఎన్నిక లాంఛనమే'
శశి థరూర్ తన అభిప్రాయాన్ని మరింత వివరిస్తూ.. "ఇది పార్లమెంటులోని ఉభయ సభల ఎన్నిక. రాష్ట్ర శాసనసభ సభ్యులు కూడా ఓటు వేసే రాష్ట్రపతి ఎన్నికకు భిన్నంగా, ఉపరాష్ట్రపతి పదవికి కేవలం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. కాబట్టి మాకు మెజారిటీ గురించి ముందే తెలుసు. తదుపరి ఉపరాష్ట్రపతి అధికార పార్టీ నామినేట్ చేసిన వ్యక్తే అవుతారని ఇది పూర్తిగా స్పష్టంగా ఉందని నేను భావిస్తున్నాను" అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఎన్నిక కేవలం ఒక లాంఛనప్రాయమని, అధికార పక్షం నిర్ణయమే అంతిమమని శశి థరూర్ పరోక్షంగా సూచించారు. అయితే, తదుపరి ఉపరాష్ట్రపతి ఎంపిక కోసం ప్రతిపక్షంతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని థరూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం సెప్టెంబర్ 9వ తేదీని ఎన్నికల రోజుగా నిర్ణయించింది. ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు 7న విడుదల కానుంది. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21. ఎన్నికల ఫలితాలు ఓటింగ్ జరిగిన రోజే, అంటే సెప్టెంబర్ 9న ప్రకటించబడతాయి.
దేశ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఒక ఎన్నికల మండలి. ఈ మండలిలో రాజ్యసభలోని ఎన్నికైన సభ్యులు,నామినేట్ చేయబడిన సభ్యులతో పాటు లోక్‌సభలోని ఎన్నికైన సభ్యులు కూడా ఉంటారు. రెండు సభలలోని మొత్తం సభ్యుల సంఖ్య 782. అర్హత కలిగిన ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటే, ఉపరాష్ట్రపతి అభ్యర్థి గెలవడానికి 391 ఓట్లు అవసరం.ప్రస్తుతం లోక్‌సభలో అధికార ఎన్‌డీఏ కూటమికి 542 మంది సభ్యులలో 293 మంది సభ్యుల మద్దతు ఉంది. రాజ్యసభలో 240 మంది సభ్యులలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో అధికార కూటమికి మొత్తం 422 మంది సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ లెక్కల ప్రకారం, తమ అభ్యర్థిని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిపించడానికి అధికార పక్షానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సంఖ్యాబలం అధికార కూటమికే అనుకూలంగా ఉంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications