viral video:నేను వెళ్లా..ఫెర్‌వెల్‌ స్పీచ్‌‌లో ఇండిగొ ఫ్లైట్ అటెండెంట్ భావొద్వేగం..కంటతడి

ఏ జాబ్‌లోనైనా రిటైర్మెంట్ తప్పదు. కానీ అన్నీ రోజులు సాటి ఉద్యోగులతో గడిపినా క్షణాలు, వినియోగదారులతో సంబంధాలు, కస్టమర్స్‌కు సేవలు మరచిపోలేం.. రేపు తిరిగి రాం కదా అని బాధపడుతుంటారు. నిజమే మరీ.. ఏళ్లకొద్దీ సర్వీస్ చేసి.. తిరిగి రాలేకపోవడం అంటే మాటలు కాదు.. అలా ఏ ఫ్లైట్ అటెండెంట్ భావొద్వేగానికి గురయ్యారు. ఆ వీడియోను ఒకరు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు చాలా మంది థాంక్స్ చెబుతున్నారు. ఇండిగో ఫ్లైట్ యాజమాన్యం మంచి ఉద్యోగులను ఎంపిక చేసిందని ప్రశంసిస్తున్నారు.

సురభీ నాయర్.. కంటతడి

సురభీ నాయర్.. కంటతడి

ఆ వీడియోలో కనిపిస్తోన్న ఆమె పేరు సురభీ నాయర్.. ఆమె ఇండిగో ప్లైట్‌లో అటెండెంట్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆమె పనిచేసే చివరిరోజు రానే వచ్చింది. ఇంకేముంది ఆమె కంట కన్నీరు ఆగలేదు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు అని గుండె లోపలి నుంచి వస్తోన్న దు:ఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె చివరి కాల్ మాట్లాడే సమయంలో సింగర్, రేడియో జాకీ అమృత సురేశ్ వీడియో తీశారు. అలా పోస్ట్ చేయడం.. నెటిజన్లు రిప్లై ఇచ్చారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

కంపెనీ అన్నీ ఇచ్చింది..

కంపెనీ అన్నీ ఇచ్చింది..

తనకు కంపెనీ అన్నీ ఇచ్చిందని సురభి నాయర్అన్నారు. తమది చాలా మంచి కంపెనీ అని.. తనకు పనిచేసే అవకాశం కలిగించిందని తెలిపారు. తననే కాదు ప్రతీ ఒక్కరినీ చాలా చక్కగా చూసుకుందని వివరించారు. ముఖ్యంగా మహిళా అటెండెంట్లను గౌరవించిందని పేర్కొన్నారు. అందుకే తాను కంపెనీ వదిలి వెళ్లాలని లేదని చెప్పింది. కానీ వెళ్లక తప్పడం లేదని పేర్కొంది.

3.2 లక్షల వ్యూస్

ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఇప్పటికే 3.2 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. సురభి నాయర్‌కు ఇప్పటికే చాలా మంది అభినందనలు తెలియజేశారు. చాలా మంది తాము ఇదివరకు పర్యటించిన సమయంలో సర్వ్ చేసి ఉంటారని.. అప్పుడు చెప్పలేకపోయాం.. అని ఇప్పుడు థాంక్స్ చెప్పారు. మీరు కంపెనీ కోసం సమయం కేటాయించి అద్భుతంగా పనిచేశారు అని ప్రశంసించారు. అంకితభాంతో పనిచేశారని.. మేమంతా మిమ్మల్ని మిస్ అవుతామని చెప్పారు. ఇలాంటి వారిని విధుల్లో చేర్చుకున్నందుకు ఇండిగో విమానయాన సంస్థకు వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+