ఇంజన్‌లో సమస్య.. 65 విమానాలు రద్దు, ఇబ్బందుల్లో ప్రయాణికులు

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ఒకటా రెండా.. వివిధ నగరాలకు వెళ్లాల్సిన 65 విమానాలు ఒక్కసారే రద్దయ్యాయి. బడ్జెట్ క్యారియర్‌లైన ఇండిగో 47 విమానాలను రద్దు చేస్తే.. గోఎయిర్ 18 విమానాలను రద్దు చేసింది.

ఏ 320 నియో విమానాల ఇంజన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, కాబట్టి వాటిని అత్యవసరంగా నిలిపివేయాలని మంగళవారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించడంతో రెండు విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

IndiGo, GoAir Cancel 65 Flights After Planes Are Grounded, Passengers Stuck

ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్‌సర్, గౌహతి తదితర నగరాలకు వెళ్లాల్సిన ఆ రెండు సంస్థల విమానాలు అర్ధంతరంగా రద్దయ్యాయి.

దీంతో వివిధ నగరాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. సోమవారం అహ్మదాబాద్ నుంచి లక్నోకు వెళుతున్న ఇండిగో విమానం.. గాల్లోకి లేచిన 40 నిముషాల్లోనే సాంకేతిక సమస్యలు తలెత్తి మధ్యలోనే దించేయడంతోనే డీజీసీఏ ఈ ఆదేశాలు జారీ చేసింది.

భద్రతా కారణాలు దృష్ట్యానే పీడబ్ల్యూ1100 ఇంజన్లు కలిగిన ఏ320 నియో విమానాలను రద్దు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు డీజీసీఏ ప్రకటించింది. డీజీసీఏ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు తమ విమానాలను రద్దు చేస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది.

అయితే, విమానాల రద్దు వల్ల తమ ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలిగిన మాట వాస్తవమేనని, దానిని భర్తీ చేసేందుకు అదే నగరాలకు వెళ్లే తమ వేరే విమానాల్లో వారిని గమ్యస్థానాలకు చేరుస్తామని సంస్థ ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Budget carriers IndiGo and GoAir cancelled as many as 65 flights today after the country's aviation regulator Directorate General of Civil Aviation, or DGCA grounded 11 of their A320Neo planes with faulty Pratt & Whitney engines, causing severe inconvenience to hundreds of flyers. The Gurugram-based IndiGo cancelled 47 of its 1,000-odd flights per day while the Wadia Group-promoted GoAir said it has cancelled 18 flights. GoAir cancelled 18 flights originating from over eight cities, the airline said in a statement to PTI. GoAir operates 230 flights per day. On its website, IndiGo announced the cancellations of some 47 flights across its domestic network for today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి