ట్రయంగిల్ లవ్: ప్రేయసితో కలిసి భార్యను చంపిన ఎన్నారై

Subscribe to Oneindia Telugu

టొరంటో: సస్పెన్స్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ హత్యకు దారితీసింది. భార్య హత్యకు దారితీసిన ఈ కేసులో భారత సంతతికి చెందిన హతురాలి భర్త, అతని ప్రియురాలినీ కెనడా కోర్టు దోషులుగా తేల్చింది. గుర్ ప్రీత్ రోనాల్డ్ (37), ఆమె ప్రియుడు భూపిందర్ పాల్ గిల్ (41)తో కలిసి అతని భార్య జగ్తార్ గిల్(43)ను చంపినట్లు నిర్ధారించింది కోర్టు.

2014 జనవరిలో జగ్తార్ గిల్ (43) తన ఇంట్లో హత్యకు గురై కనిపించారు. దానిపై పోలీసులు రెండేళ్లపాటు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపారు. అనంతరం ఒటావాలోని సుపీరియర్ కోర్టులో 9 వారాల పాటు విచారణ జరిగింది. ఆ విచారణ అనంతరం తమ ప్రేమకు అడ్డుగా ఉందని ఆమెను ప్రేయసీ ప్రియులిద్దరూ కలిసి చంపినట్లు తేల్చారు.

తమ 17వ పెళ్లిరోజునే జగ్తార్ గిల్‌ను దారుణంగా పొడిచి చంపారు. హత్యకు ఒకరోజు ముందే ఆమెకు చిన్నపాటి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆమె భర్త భూపీందర్ పాల్ గిల్, అతడి ప్రేయసి గుర్ ప్రీత్ రోనాల్డ్ ఇద్దరూ ఒటావాలోని ఓసీ ట్రాన్స్ పోలో బస్సు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. అంతేగాక, పక్కపక్క ఇళ‍్లలో ఉండేవారు. వాళ్ల మధ్య ప్రేమ మొదలైంది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఉండాలంటే భార్య అడ్డు తొలగించుకోవాలని భావించి, ఆమెను హతమార్చినట్లు రుజువైంది.

Indo-Canadian Woman, Lover Found Guilty Of Murder

కాగా, గిల్ దంపతులకు ముగ్గురు పిల్లలుండగా, రోనాల్డ్ కు ఇద్దరు కూతుళ్లున్నారు. గిల్‌తో తనకు లైంగిక సంబంధం ఉందని అంగీకరించిన గుర్ ప్రీత్.. తాను అతడితో సంతృప్తి చెందలేదని, అందుకే అదే సమయంలో మరో డ్రైవర్‌తో కూడా సంబంధం పెట్టుకున్నానని పోలీసుల విచారణలో వెల్లడించడం గమనార్హం.

కాగా, ఆమెకు కేవలం ఏడ్చేటప్పుడు ముఖం ఆనించడానికి ఒక భుజం మాత్రమే అవసరమైందని, ఆ మద్దతు కోసమే స్నేహం ఏర్పరుచుకుందని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే, తాను 2013లోనే గుర్ ప్రీత్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు భూపిందర్ పాల్ గిల్ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A jury has found Gurpreet Ronald, 37, and her lover Bhupinderpal Gill, 41, guilty of first degree murder of Gill's wife in the sensational Indo-Canadian love triangle murder case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి