తన తల్లి ఇంద్రాణి ముఖర్జీతో కలిసుండాలని కోరిన కూతురు విధి: కోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ: తన కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో బెయిల్‌పై విడుదలైన ఇంద్రాణి ముఖర్జియా తన మరో కుమార్తె విధితో కలిసి జీవించడానికి వీల్లేదని ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం స్పష్టం చేసింది. కొన్నాళ్ల పాటు విదేశాల్లో గడిపిన తర్వాత సెప్టెంబర్ 10న తిరిగి వచ్చిన తర్వాత ముంబైలో తన తల్లి ఇంద్రాణితో కలిసి ఉండేందుకు అనుమతించాలని విధి ముఖర్జీ కోర్టును కోరింది.

విధి అభ్యర్ధన విచారణ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దానిని వ్యతిరేకిస్తూ ఇలా పేర్కొంది.. "విధీ ముఖర్జీని ప్రాసిక్యూషన్ సాక్షిగా పేర్కొన్నారు. ఆమెను ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ విచారించలేదు. ఇంద్రాణి ముఖర్జియా తన సొంత కుమార్తె షీనా బోరాను హత్య చేయాలనే లక్ష్యంతో ఇతర నిందితులతో కలిసి కుట్ర పన్నిందని, ఆమెను డిన్నర్‌కి పిలిచి, ఆ తర్వాత కారులోనే హత్య చేసింది. మృతదేహం, సాక్ష్యాలను నాశనం చేసిందని ప్రాసిక్యూషన్ కేసు అని పేర్కొంది.

Indrani Mukerjeas daughter wants to live with mother: CBI special Court says no

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం.. నిందితుడితో కలిసి జీవించేందుకు సాక్షి అలాంటి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని పేర్కొంటూ ప్రత్యేక సీబీఐ జడ్జి ఎస్పీ నాయక్ నింబాల్కర్ విధి పిటిషన్‌ను తిరస్కరించారు.

ఇంద్రాణి ముఖర్జియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో బెయిల్ షరతుల్లో ఒకటిగా, ఆమె సాక్షులను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నట్లు కోర్టు పేర్కొంది. ప్రత్యేక సీబీఐ కోర్టు ఆదేశాలతో విధి బాధపడితే, ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించవచ్చు.

విధి దరఖాస్తులో ఆమె చాలా సంవత్సరాలుగా విదేశాలలో నివసిస్తున్నట్లు పేర్కొంది. ఆమె "అరెస్ట్ అయిన రోజు నుంచి ఆమె తన తల్లి సాంగత్యం, ప్రేమ, ఆప్యాయతలను కోల్పోయింది. గత ఏడు సంవత్సరాలుగా ఆమెతో లేదు. ఇది ఆమె మానసిక శ్రేయస్సును తీవ్రంగా ప్రభావితం చేసింది అని పేర్కొంది.

విధి "ఇప్పుడు ఎడబాటును ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల ఆమె తన తల్లితో స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేయడానికి, ఆమె జీవించడానికి కోరుకుంటుంది' అని అప్లికేషన్ పేర్కొంది.

ఇంద్రాణి "కోలుకోలేని సెరిబ్రల్ ఇస్కీమియాతో బాధపడుతోంది, ఆమె బలహీనంగా ఉంది. సరైన వ్యక్తిగత, వైద్య సంరక్షణ అవసరం" అని సీబీఐ కోర్టు ముందు చేసిన అభ్యర్థనలో విధి పేర్కొంది. ఇంద్రాణికి ముంబైలో ఆమెతో పాటు "కుటుంబం లేదు" అని కూడా పిటిషన్‌లో పేర్కొంది. అయితే, సీబీఐ కోర్టు మాత్రం విధి అభ్యర్థనను తిరస్కరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+