Indus Waters Treaty: సింధు జలాలపై అంతర్జాతీయ కోర్టు తీర్పు..! భారత్ కీలక నిర్ణయం..!
కశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడుల తర్వాత ఆ దేశానికి సింధు జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నీరు లేక అల్లాడుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్దానాన్ని ఆశ్రయించింది. ఈ న్యాయస్థానాన్ని భారత్ గుర్తించకపోవడంతో రెండు వైపులా కోర్టు ఖర్చులు తానే చెల్లించి మరీ పోరాటాలు చేస్తోంది. వీటి ఫలితంగా తాజాగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు తాత్కాలిక తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం పాకిస్తాన్ కు సింధు జలాలు వదలాల్సి ఉంది.
కానీ భారత్ తమ నిర్ణయంపై వెనక్కి తగ్గేందుకు నిరాకరించింది. అంతే కాదు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్దానానికి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై స్పందించేందుకు ఎలాంటి అధికార పరిధి లేదని స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతూనే ఉందని, కాబట్టి భారతదేశ సార్వభౌమ నిర్ణయాలపై తీర్పులు ఇచ్చేందుకు ఈ కోర్టుకు ఎటువంటి అధికార పరిధి లేదని భారత్ తేల్చిచెప్పేసింది. ఈ మేరకు కోర్టు తాజా తీర్పును తోసిపుచ్చింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ ఓ ప్రకటన చేసింది.

ఈ ఒప్పందంలోని నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తూ ప్రపంచ బ్యాంకు ఈ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసిందని, చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేయబడిన ఈ సంస్థ గతంలో చేసిన అన్ని ప్రకటనలను భారతదేశం ఎలాగైతే గట్టిగా తిరస్కరించిందో, అలాగే ఇప్పుడు ఈ న్యాయస్థానం యొక్క ఈ తీర్పును కూడా ఖచ్చితంగా తిరస్కరిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేయబడిన ఈ సంస్థ ఉనికిని భారతదేశం చట్టబద్ధంగా ఎన్నడూ గుర్తించలేదని, ఈ మధ్యవర్తిత్వ సంస్థను ఏర్పాటు చేయడమే సింధు జలాల ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని స్థిరంగా వాదిస్తూనే ఉందని వెల్లడించింది. అందువల్ల భారత్ ఈ సంస్థ ముందు ఎన్నడూ హాజరు కాలేదని, దాని గత ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించిందిని విదేశాంగశాఖ స్పష్టత ఇచ్చింది.













Click it and Unblock the Notifications