వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిక్కా నిష్ర్కమణకు నారాయణమూర్తే కారణం: ఇన్ఫోసిస్ సంచనలం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈవో బాధ్యతల నుంచి విశాల్‌ సిక్కా వైదొలగడానికి కంపెనీ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తే కారణమని ఇన్ఫోసిస్‌ సంచలన ఆరోపనలు చేసింది. గత కొంతకాలంగా నారాయణ మూర్తి చేస్తున్న వరుస ఆరోపణలు, ఇటీవల ఆయన రాసిన లేఖ వల్లే విశాల్‌ సిక్కా రాజీనామా చేసినట్లు ఇన్ఫోసిస్‌ పేర్కొంది.

నారాయణ మూర్తి 'బ్లూవేల్' ఆడించారా?: సిక్కా ఏమన్నారంటే..?నారాయణ మూర్తి 'బ్లూవేల్' ఆడించారా?: సిక్కా ఏమన్నారంటే..?

ఆ ఉద్దేశం లేదు..

ఆ ఉద్దేశం లేదు..

కంపెనీలో నారాయణమూర్తికి పూర్వ బాధ్యతలు అప్పగించే ఉద్దేశమేదీ లేదని ఇన్ఫోసిస్‌ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు సిక్కా రాజీనామాకు గల కారణాలను ఇన్ఫోసిస్‌ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

మూర్తి ఆరోపణల వల్లే..

మూర్తి ఆరోపణల వల్లే..

ఇటీవల మూర్తి రాసిన లేఖలో కంపెనీ కార్పొరేట్‌ పాలనా వ్యవహారాలు సరిగా లేవని వ్యాఖ్యానించారని, బోర్డు సమగ్రతను, మేనేజ్‌మెంట్‌ పనితీరును తప్పుబట్టారని ఇన్ఫోసిస్ పేర్కొంది. మూర్తి లేఖ మమ్మల్ని తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఇన్ఫీ బోర్డు వివరించింది.

మూర్తివి సరికాని డిమాండ్లు..

మూర్తివి సరికాని డిమాండ్లు..

బలమైన పాలన కోసం సరికాని డిమాండ్లను నారాయణ మూర్తి చేసే వారని ఇన్ఫోసిస్ ఆరోపించింది. కంపెనీ బోర్డు స్వతంత్రంగా వ్యవహరిస్తోందని.. ఇందులో షేర్‌హోల్డర్ల మెజార్టీ నిర్ణయం మేరకే బోర్డు సభ్యులు ఎన్నికయ్యారని ఇన్ఫీ తెలిపింది.

విమర్శల నేపథ్యంలోనే..

విమర్శల నేపథ్యంలోనే..

గత కొంతకాలంగా ఇన్ఫోసిస్‌ బోర్డుపై.. సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎగ్జిక్యూటివ్‌లకు అధిక ప్యాకేజీలు చెల్లించారని, కంపెనీ కార్పొరేట్‌ పాలన సరిగా లేదని పలుమార్లు విమర్శించడం తదనంతర పరిణామాల నేపథ్యంలో సిక్కా రాజీనామా చేశారు. ఇప్పటికే కంపెనీలో పలువురు కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

English summary
The Board of directors of Infosys Ltd has squarely blamed founder N R Narayana Murthy for forcing the exit of MD and CEO Vishal Sikka from his post, a little over three years after he assumed the role.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X