ఇన్ఫోసిస్ లేడీ టెక్కీ కిడ్నాప్: హత్య కేసు, ఛీ కొట్టిందని: మాజీ లవర్ ఏం చేశాడంటే, చివరికి !

Posted By: Staff
Subscribe to Oneindia Telugu

మైసూరు: కార్యాలయానికి వెలుతున్న ఇన్ఫోసిస్ లేడీ టెక్కీని కిడ్నాప్ చేసిన ముగ్గురు నిందితులను మైసూరు నగరంలోని హెబ్బాళ పోలీసులు అరెస్టు చేశారు. లేడీ టెక్కీ మాజీ ప్రియుడు నవీన్, అతని ఇద్దరి స్నేహితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

భార్య ప్రజాప్రతినిధి: ప్రియుడితో బెడ్ రూంలో నగ్నంగా: వీడియో తీసిన భర్త ఏం చేశాడంటే!

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరుకు చెందిన 25 ఏళ్ల యువతిని క్షేమంగా రక్షించామని మంగళవారం పోలీసులు చెప్పారు. ఇన్ఫోసిస్ లేడీ టెక్కీ, నవీన్ గతంలో ప్రేమించుకున్నారని, ఇద్దరూ అప్పట్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించారని పోలీసులు అన్నారు.

కాలేజ్ లో స్నేహితులు !

కాలేజ్ లో స్నేహితులు !

హోసూర్ కు చెందిన 25 ఏళ్ల యువతి, నవీన్ ఇద్దరూ కాలేజ్ లో చదువుకునే రోజుల్లో స్నేహితులు, ఇద్దరూ అప్పట్లో ప్రేమించుకున్నారు. తరువాత కుటుంబ సభ్యులు అంగీకరించకపోయినా పెళ్లి చేసుకోవాలని ఆ యువతి, నవీన్ నిర్ణయించారు.

18 నెలలు నుంచి మైసూరులో !

18 నెలలు నుంచి మైసూరులో !

గత సంవత్సరం జనవరిలో మైసూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం రావడంతో హోసూరు నుంచి ఆ యువతి మైసూరుకు వెళ్లింది. స్నేహితురాలితో కలిసి నివాసం ఉంటూ అక్కడే ఉద్యోగం చేస్తోంది.

హత్య కేసులో ప్రియుడు జైలుకు !

హత్య కేసులో ప్రియుడు జైలుకు !

ఓ హత్య కేసులో నవీన్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. రెండు నెలల క్రితం నవీన్ బెయిల్ మీద జైలు నుంచి విడుదలైనాడు. ఈ విషయం లేడీ టెక్కీకి తెలిసింది. కేసులో హంతకుడిగా అరెస్టు అయిన నవీన్ ను పెళ్లి చేసుకుంటే జీవితం నాశనం అవుతోందని ఆమె భయపడింది.

ఛీ కొట్టిన యువతి !

ఛీ కొట్టిన యువతి !

హత్య కేసులో అరెస్టు అయిన నువ్వు ఎప్పుడు జైలుకు వెలుతావో, ఎప్పుడు బయట ఉంటావో తెలీదు, నిన్ను పెళ్లి చేసుకోనని యువతి తేల్చి చెప్పింది. అయితే తననే వివాహం చేసుకోవాలని నవీన్ తన ప్రియురాలిని బెదిరించాడు. అయితే ఆమె నవీన్ ను ఛీకొట్టి దూరం పెట్టింది.

నడిరోడ్డులో ఎత్తుకెళ్లాడు !

నడిరోడ్డులో ఎత్తుకెళ్లాడు !

తనను పెళ్లి చేసుకోనని ఎదిరించిన మాజీ ప్రియురాలిని కిడ్నాప్ చెయ్యాలని నవీన్ ప్లాన్ చేశాడు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఆమె తన స్నేహితురాలితో కలిసి కార్యాలయానికి బయలుదేరింది. మైసూరు నగరంలోని సంక్రాంతి సర్కిల్ లో అప్పటికే మకాం వేసిన నవీన్ తన స్నేహితులతో కలిసి ఆమెను కారుడలో కిడ్నాప్ చేశాడు.

స్నేహితురాలిని పంచేస్తామని !

స్నేహితురాలిని పంచేస్తామని !

తన మాజీ ప్రియురాలిని కిడ్నాప్ చేసే సమయంలో అడ్డు వచ్చిన ఆమె స్నేహితురాలిని నవీన్, అతని స్నేహితులు బెదిరించారు. అడ్డు వస్తే చంపేస్తామని హెచ్చరించారు. అయితే తన స్నేహితురాలిని కిడ్నాప్ చేసిన కారు నెంబర్ నోట్ చేసుకున్న ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.

తమిళనాడులో అరెస్టు !

తమిళనాడులో అరెస్టు !

యువతిని కిడ్నాప్ చేసిన నిందితులు ఎటువైపు వెళ్లారు అంటూ సంక్రాంతి సర్కిల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీసులు పరిశీలించారు. నిందితులు తమిళనాడు మార్గంలో వెలుతున్నారని గుర్తించారు. సినిమా ఫక్కీలో ఆ కారును వెంబడించారు. 12 గంటల తరువాత నిందితులు ఉన్న ప్రాంతం గుర్తించి వారిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Infosys woman employee kidnapped in Mysuru. Three parsons arrested in Tamil Nadu.
Please Wait while comments are loading...