నటి శిఖా మృతి: ఆసుపత్రికి తీస్కెళ్లకుండా వీడియో తీయడమేంటి?
ముంబై: బీఏ పాస్ ఫేం బాలీవుడ్ నటి శిఖా జోషీ మృతి కేసులో మరో ట్విస్ట్. తన సోదరి శిఖాను ఆమె రూమ్మేట్ త్వరగా ఆసుపత్రికి తీసుకు వెళ్తే బతికేదని ఆమె సోదరుడు ఆరోపించారు. తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లడంలో ఆలస్యమైందని అన్నారు.
వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లి ఉంటే బతికేదన్నారు. తన సోదరి స్నేహితురాలు రెండు నిమిషాల పాటు సూసైడ్ స్టేట్‌మెంట్ వీడియో తీసుకునే బదులు ఆసుపత్రికి తరలించాల్సింది అన్నారు. ఆమె వీడియో తీసే బదులు చికిత్స కోసం తరలించాల్సింది అన్నారు.

శిఖా జోషి మృతి కేసులో పోలీసులు ఆమె స్నేహితురాలు మధు భారతిని రెండుసార్లు విచారించారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లకుండా వీడియో తీయడాన్ని కూడా పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
కాగా, బీఏ పాస్ ఫేం బాలీవుడ్ నటి శిఖా జోషీ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆమె బాత్‌రూంలో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణించే ముందు ఆమె స్నేహితురాలు, రూమ్మేట్ అయిన మధు ఓ వీడియో తీసింది.

ఆ వీడియోలో శిఖా జోషి.. తన మరణానికి ఓ కాస్మెటిక్ సర్జన్, బాలీవుడ్‌లోని పలువురు పెళ్లైన పురుషులు కారణమని ఆ వీడియోలో ఆరోపించింది. పోలీసులు ఆ వీడియోను పరిశీలించారు.












Click it and Unblock the Notifications