మోడీని చంపేస్తామంటూ ట్విట్టర్ పోస్టు: ఇండియా టీవీ వెల్లడి
న్యూఢిల్లీ: ఐసీస్ ఉగ్రవాదులు ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామంటూ ట్విట్టర్‌లో పోస్టు చేసారని ఇండియా టీవీ పేర్కొంది. ముంబై నుంచి ఐసీస్‌లో చేరిన నలుగురిలో ఒకరు ఈ ట్విటర్ ఖాతాను నడుపుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ట్విటర్ ఖాతా కలిగిన వ్యక్తి టర్కీకి చెందిన వాడిగా చూపిస్తోంది.
ఈ ట్విట్టర్ ఖాతాని 500 మంది అనుసరిస్తున్నారు. ఇందులో ఐసిస్‌కు అనుకూలంగా 220 మెసేజ్ లున్నాయి. దీని ఐపీ అడ్రస్ తెలుసుకునేందుకు భారత దర్యాప్తు సంస్థ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఈ ట్విటర్ ఖాతాను విదేశాల నుంచి నడుపుతున్నారా లేదా భారత్ నుంచా అనేది కనిపెట్టడం కష్టంగా మారింది.

ప్రధాని మోడీ, ఒబామా ఇద్దరూ అల్లాకు శత్రువులని, భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా వస్తున్న ఒబామాను కారు బాంబు, రసాయన ఆయుధాలతో అంతం చేయాలని జనవరి 25న ఐసిస్ ఉగ్రవాదులు ట్వీట్ చేశారు.
ప్రధాని నివాసం, పార్లమెంట్‌పై దాడులు జరగొచ్చు: ఐబీ హెచ్చరిక
ఇంటిలిజెన్స్ బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలోని 7 రేస్ కోర్సు రోడ్డులో ఉన్న ప్రధాని నివాసం, పార్లమెంట్ భవనంపై ఉగ్రవాది ఆత్మాహుతి దాడులు జరగవచ్చని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
దీంతో ఢిల్లీ పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు ఈ రెండు చోట్లా భారీ భద్రతను కల్పించాయి. దీంతో పాటు ఢిల్లీలోని సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఉగ్రదాడులు చేసేందుకు ఇప్పటికే ఢిల్లీలోకి ఆత్మాహుతి దళ సభ్యులు ప్రవేశించారని ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు చేసింది.












Click it and Unblock the Notifications