డోర్ బెల్ పాడయ్యింది .. మోడీ మోడీ అని అరవాలట... ఇంట్రెస్టింగ్ కదూ

దేశంలో ఎన్నికల సంగ్రామం జరుగుతుంది .ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారం పైనే దృష్టి సారించాయి. అయితే మధ్యప్రదేశ్లోని మొరేనా లో ఓ ఆసక్తికర ప్రచారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.మోడీ పట్ల పూర్తిగా సానుకూల దృక్పథంతో ఉన్న కొందరు ప్రజలు తమ ఇళ్లముందు ఆసక్తికర నినాదాన్ని రాసుకున్నారు డోర్ బెల్ పాడైంది తలపులు తీసేందుకు దయచేసి మోడీ మోడీ అరవండి అంటూ రాసుకున్న నినాదం పై ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మధ్యప్రదేశ్ లోని మొరేనా లో ఆసక్తికర నినాదం

మధ్యప్రదేశ్ లోని మొరేనా లో ఆసక్తికర నినాదం

మధ్యప్రదేశ్‌లో నాలుగు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 29న 6 లోక్ సభ స్థానాలకు, మే 6న 7 లోక్‌సభ స్థానాలకు, మే 12న 8 లోక్ సభ సీట్లకు ఓటింగ్ జరగనుంది. చివరగా మే 19న 8 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని మొరేనాలో ఒక ఆసక్తికర నినాదం వెలుగు చూసింది.

డోర్ బెల్ పాడయింది మోడీ మోడీ అని అరవండి

డోర్ బెల్ పాడయింది మోడీ మోడీ అని అరవండి

ఇక్కడి రామ్‌నగర్ కాలనీలోని చాలా ఇళ్ల ముందు వేరే పార్టీల వాళ్ళు రాకుండా నోటీసులు అతికించారు. ఆ నోటీసులలో చాలా ఆసక్తికరమైన విషయం రాసి వుంది . ఇంటి తలుపులకు అంటించిన నోటీసులలో ‘డోర్ బెల్ పాడయ్యింది. తలుపులు తీసేందుకు దయచేసి ‘మోడీ, మోదీ' అని అరవండి' అని రాసివుంది. ఈ విచిత్ర ప్రకటన స్థానికులను బాగా ఆకట్టుకుంటోంది.

 వందమంది ఇళ్ళ ముందు అతికించిన నోటీసులు

వందమంది ఇళ్ళ ముందు అతికించిన నోటీసులు

దీనిపై రామ్‌నగర్ కాలనీవాసులు మాట్లాడుతూ...ఎవరైనా వచ్చి తమను వేరే పార్టీకి ఓటెయ్యమని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నామని వారు చెప్తున్నారు . ఆ కాలనీలో వందకు మించిన ఇళ్ల ముందు ఇటువంటి నోటీసులు అతికించారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న పనులకు మెచ్చుకోలుగా ఇటువంటి నినాదం వినిపిస్తున్నామని వారు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+