కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఇదే..అప్పటిదాకా సోనియానే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడంతో ముగిసింది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం.. కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం దూరమౌతుందంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి ముహూర్తాన్ని కూడా నిర్ధారించింది.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఈ సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ఎన్నికలను నిర్వహించాలని తీర్మానించింది. ఈ తేదీ పట్ల సీడబ్ల్యూసీ సభ్యులు ఏకగ్రీవంగా తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడటానికి ముందే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడం వల్ల నూతనోత్తేజాన్ని నింపినట్టవుతుందని అభిప్రాయపడ్డారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా- రాజీనామాల ప్రతిపాదన ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా ఎదురవుతోన్న ఘోర పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులన్నింటికీ రాజీనామ చేస్తామంటూ వారు చేసిన ప్రతిపాదనలను సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, పార్టీ మళ్లీ విజయాలబాట పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Internal elections date for to elect new Congress president has been set for August 20

గాంధీ కుటుంబం రాజీనామాలు చేయడం వల్ల ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని, మిత్రపక్షాలు రాజకీయంగా ఇబ్బందులకు గురవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో వారి అభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున- ఈ రాజీనామాల ప్రభావం వాటిపై పడుతుందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌ రాజకీయ పరిస్థితులు పార్టీకి అనుకూలంగా ఉందని, అది దెబ్బతినే ప్రమాదం ఉందనీ పేర్కొన్నారు.

Recommended Video

    5 States Assembly Election Results: Rahul Gandhi Reaction On Congress Poor Run | Oneindia Telugu

    ఆగస్టు 20వ తేదీన నిర్వహించే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయం మీద సీడబ్ల్యూసీలో చర్చ జరగలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇది ఇప్పటికిప్పుడు చర్చించాల్సిన అంశమేమీ కాదని వ్యాఖ్యానించారు. కాగా- పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే మరోసారి సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు కానుంది. మూడురోజుల పాటు చింతన్ బైఠక్‌ను నిర్వహించడానికి అవసరమైన అజెండాను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+