4 ఎయిర్ పోర్టులు, 7 ఎక్స్‌ప్రెస్‌వేలు - భారీ ప్లాన్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న వేళ.. ఎన్డీఏ కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాలు.. వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వలసలను దృష్టిలో ఉంచుకుని కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంయుక్తంగా ఈ 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్ శక్తి పార్టీ, ఇతర భాగస్వామ్య పక్షాల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగావకాశాల కల్పన ఈ మేనిఫెస్టోలో కీలకమైన అంశం. ఏటా పెద్ద సంఖ్యలో వలస వెళ్లే కార్మికుల సమస్యకు పరిష్కారంగా, మళ్లీ అధికారంలోకి వస్తే నైపుణ్య ఆధారిత ఉద్యోగాల కోసం నైపుణ్య గణన నిర్వహిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.

అధికారంలోకి వచ్చిన వెంటనే కోటి మంది మహిళలను 'లక్షాధికారి దీదీలు'గా మార్చుతామని తెలిపింది. దీంతో పాటు- నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఏడు ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించినట్లు వివరించింది. 50 లక్షల కొత్త పక్కా ఇళ్ల నిర్మాణం, ఉచిత రేషన్, 125 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స, పీఎం ఆవాస్ యోజన కింద సామాజిక భద్రతా పెన్షన్ కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి.
'ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్లతో బీహార్‌ను గ్లోబల్ స్కిల్లింగ్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. బీహార్ స్పోర్ట్స్ సిటీలో క్రీడల కోసం అనేక 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఇందులో వెల్లడించారు. ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం ద్వారా మహిళలకు రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. కోటి మంది మహిళలను 'లక్షాధికారి దీదీలు'గా మార్చడం ద్వారా వారిని సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదించేలా ప్రోత్సహిస్తామని పేర్కొంది.
'మిషన్ కోటీశ్వరి' ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను కోటీశ్వరులుగా మార్చాలని కూడా కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే, ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు, 3,600 కిలోమీటర్ల రైలు మార్గాల ఆధునీకరణకు ప్రణాళికలు రూపొందించింది. పాట్నా, దర్భంగా, పూర్ణియా, భాగల్‌పూర్ లల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు, నాలుగు నగరాల్లో మెట్రో నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తామని, 10 నగరాలకు విమాన కనెక్టివిటీని విస్తరిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది.
ప్రతి జిల్లాలో కర్మాగారాలు, 10 కొత్త పారిశ్రామిక పార్కుల నిర్మాణం కూడా ఈ హామీల జాబితాలో ఉన్నాయి. కనీసం 100 ఎంఎస్‌ఎంఈ పార్కులు, 50,000 కుటీర పరిశ్రమలు నిర్మిస్తామని ఎన్డీఏ పేర్కొంది. ఓ ప్రపంచ స్థాయి మెడిసిటీ, ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాలతో పాటు రక్షణ కారిడార్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌లతో కూడిన సెమీకండక్టర్ తయారీ పార్కు నిర్మాణం కూడా ఇందులో ఉన్నాయి. బీహార్‌ను దక్షిణాసియాలో టెక్స్‌టైల్, సిల్క్ హబ్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొంది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications