ఫిబ్రవరి 28 దాకా ఆ విమానాల్లేవ్ -అంతర్జాతీయ సర్వీసుల రద్దు గడువు పొడిగింపు: DGCA

ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థిల నేపథ్యంలో విమాన ప్రయాణాలకు సంబంధించి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై కొనసాగుతోన్న నిషేధాన్ని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రాబోవని తెలిపింది. అయితే..

సరుకు రవాణా (కార్గో) విమాన సర్వీసులకు మాత్రం ఈ షరతులు వర్తించబోవని డీజీసీఏ స్పష్టంచేసింది. ఈ మేరకు డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ సునీల్‌ కుమార్‌ గురువారం సాయంత్రం ఒక సర్క్యులర్‌ జారీ చేశారు.

International commercial flights to remain suspended till February 28, says DGCA

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను గతేడాది మార్చి 23 నుంచి డీజీసీఏ నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే, వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తోంది. ఇక

దేశంలో యూకే స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య 165కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. గురువారం జరిగిన మంత్రుల బృంద సమావేశంలో ఆయన దేశంలో కరోనా పరిస్థితిని సమీక్షించారు. యూకే స్ట్రెయిన్‌ కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+