వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

International yoga day 2022: మైసూరులో యోగా డే వేడుకల్లో పీఎం మోడీ; థీమ్‌ ఇదే!!

|
Google Oneindia TeluguNews

శారీరక, మానసిక వికాసానికి దోహదం చేసే, భారతీయులు పురాతన కాలం నుండి అనుసరిస్తున్న యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచం మొత్తం అనుసరిస్తున్న విషయం తెలిసిందే. యోగా పై ప్రపంచ ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తూ, ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో మానవాళికి సందేశం ఇస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక నేడు జూన్ 21 మంగళవారం నాడు దేశవ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకుంటున్నారు.

కర్ణాటక మైసూర్ లో యోగా దినోత్సవ వేడుకల్లో పీఎం మోడీ

కర్ణాటక మైసూర్ లో యోగా దినోత్సవ వేడుకల్లో పీఎం మోడీ


మంగళవారం కర్ణాటకలోని మైసూరు నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం వహించారు. వారసత్వ నగరం అయిన మైసూరు లో ప్రధానమంత్రితో పాటు 15,000 మందికి పైగా యోగా వేడుకల్లో పాల్గొన్నారు. మైసూరు ప్యాలెస్‌ గ్రౌండ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్‌, కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై తదితరులతో కలసి యోగాభ్యాసం చేశారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోడీ వెయ్యిమంది స్కూల్ విద్యార్థులతో కలిసి 45 నిమిషాలపాటు ఇరవై యోగాసనాలు వేశారు.

యోగా ఫర్ హ్యుమానిటీ థీమ్ తో యోగా వేడుకలు

యోగా ఫర్ హ్యుమానిటీ థీమ్ తో యోగా వేడుకలు


ఈ సంవత్సరం వేడుక యొక్క థీమ్ "మానవత్వం కోసం యోగా" పేరుతో నిర్వహిస్తున్నారు. యోగ ఫర్ హ్యుమానిటీ థీమ్ తో ఘనంగా జరుపుతున్నారు. అనేక చర్చలు, సంప్రదింపుల తర్వాత ఈ థీమ్ ఎంపిక చేయబడింది, ఇది కోవిడ్-19 మహమ్మారి పీక్‌లో ఉన్న సమయంలో, బాధలను తగ్గించడంలో యోగా మానవాళికి ఎలా ఉపయోగపడిందో చూపించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు యోగా దినోత్సవం రోజున తాజ్ మహల్, ఆగ్రా కోటలో ప్రవేశ రుసుము లేదు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చారిత్రక కట్టడాలైన తాజ్ మహల్, ఆగ్రా కోట మరియు ఇతర స్మారక చిహ్నాల వద్ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఎటువంటి ప్రవేశ రుసుమును వసూలు చేయబోదని ప్రకటించింది.

యోగాతో విశ్వా మానవాళికి శాంతి: ప్రధాని మోడీ

యోగాతో విశ్వా మానవాళికి శాంతి: ప్రధాని మోడీ


యోగా మనకు శాంతిని కలిగిస్తుంది....యోగా మన విశ్వానికి శాంతిని కలిగిస్తుంది. యోగ వల్ల కలిగే శాంతి వ్యక్తులకు మాత్రమే కాదని, సమస్త మానవాళికి అని ప్రధాని నరేంద్ర మోడీ మైసూర్ లో యోగా దినోత్సవ వేడుకలలో తెలిపారు. యోగా మన దేశానికి మాత్రమే కాదు ప్రపంచానికి శాంతిని తెస్తుందని పేర్కొన్నారు.అలాగే, యోగా మన విశ్వానికి శాంతిని కలిగిస్తుంది అని మైసూరులో ప్రధాని మోదీ అన్నారు. విశ్వ మానవ శ్రేయస్సు కోసం యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ప్రధాని మోడీ.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ది గార్డియన్ రింగ్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ది గార్డియన్ రింగ్

ఇదిలా ఉంటే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా 16 వేర్వేరు సమయ మండలాల్లో జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 'ది గార్డియన్ రింగ్'ను రూపొందించారు. గార్డియన్ రింగ్ ప్రోగ్రామ్‌లో, వివిధ దేశాలలో ప్రజలు సూర్యోదయంతో పాటు 16 వేర్వేరు సమయ మండలాల్లో యోగా చేస్తున్నప్పుడు యోగా ప్రదర్శన ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇది తూర్పున ఫిజీ నుంచి ప్రారంభమై పశ్చిమ దిశగా వెళ్లి శాన్ ఫ్రాన్సిస్కోలో ముగుస్తుంది.

English summary
Prime Minister Narendra Modi led the celebrations of the International Yoga Day from Mysore in Karnataka.This time Yoga Day celebrations are being held with the theme of Yoga for Humanity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X