Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఎన్ఆర్ఐ స్వీటీతో ఎంజాయ్, పక్కఊర్లో భార్య, సీఐ రెండు యాంగిల్స్, సీసీటీవీల్లో !

అహమ్మదాబాద్/చెన్నై: ఎన్ఆర్ఐ భర్తకు విడాకులు ఇచ్చిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న పోలీసు అధికారి ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఎన్ఆర్ఐ లేడీతో ఎంజాయ్ చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చిన సీఐ తరువాత కుటుంబ సభ్యులు చూపించిన యువతిని కట్నం కోసం పెళ్లి చేసుకున్నాడు. భార్యతో, ప్రియురాలికి ఒకరికి తెలీకుండా ఒకరితో కాపురం చేస్తూ నాలుగు సంత్సరాలు కాలం గడిపేశాడు. సీఐ భార్య విషయం ప్రియురాలికి తెలిసిపోయింది. అంతే అక్కడ గొడవ జరగడంతో సీఐ రగిలిపోయాడు.

ఎన్ఆర్ఐ ప్రియురాలిని చంపేసిన పోలీసు అధికారి సాక్షాలు కూడా చిక్కకూడాదని పోలీసు బుద్ది చూపించి పెట్రోల్ పోసి శవాన్ని కాల్చేశాడు. కేసు విచారణ ఎలా జరుగుతుందో ఆ పోలీసు అధికారికి తెలుసు. కేసు విచారణకు బ్రేక్ లు వేస్తూ వచ్చాడు. కేసు క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించడం, నార్కో అనాలసిస్ పరీక్షలు చెయ్యడానిసి సిద్దం కావడంతో సీఐ బండారం బయటపడింది. సీఐకి సహకరించిన ఓ ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఈ కేసులో చిక్కుకుని గిలగిలా కొట్టుకుంటున్నాడు.

 భర్తకు విడాకులు ఇచ్చిన స్వీటీ పటేల్

భర్తకు విడాకులు ఇచ్చిన స్వీటీ పటేల్

గుజరాత్ కు చెందిన స్వీటీ పటేల్ (37) అనే మహిళ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐని వివాహం చేసుకుంది. కొంతకాలం అమెరికాలో భర్తతో కాపురం చేసిన స్వీటీ పటేల్ కు తరువాత ఆమె భర్తతో గొడవలు మొదలైనాయి. అమెరికా భర్తతో విడాకులు తీసుకున్న ఎన్ఆర్ఐ మహిళ తరువాత అహమ్మదాబాద్ వచ్చేసింది.

ఎన్ఆర్ఐ లేడీని తగులుకున్న సీఐ

ఎన్ఆర్ఐ లేడీని తగులుకున్న సీఐ

వడోదరా పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్న అజయ్ దేశాయ్ కి, ఎన్ఆర్ఐ స్వీటీ పటేల్ కు పరిచయం అయ్యింది. స్వీటీ పటేల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న సీఐ అజయ్ దేశాయ్ ఆమెను పెళ్లి చేసుకోకుండానే అహమ్మదాబాద్ లోని కర్జోన్ లోని ప్రయోస సోసైటీ సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకుని కాపురం చేస్తున్నాడు.

 సీఐకి సీక్రెట్ గా మరో పెళ్లి

సీఐకి సీక్రెట్ గా మరో పెళ్లి

స్వీటీ పటేల్ తో కాపురం చేసిన అజయ్ దేశాయ్ మూడు సంవత్సరాల క్రితం ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. స్వీటీతో కాపురం చేస్తున్న సీఐ అజయ్ దేశాయ్ కట్నం కోసం కుటుంబ సభ్యులు చూపించిన యువతిని వివాహం చేసుకుని వడోదరాలో కాపురం పెట్టాడు. అజయ్ దేశాయ్ ని పెళ్లి చేసుకున్న భార్యకు మాత్రం స్వీటీ వ్యవహారం తెలీదు. సీఐ అజయ్ దేశాయ్ ని పెళ్లి చేసుకున్న యువతి ఓ బిడ్డకు తల్లి అయ్యింది.

 రచ్చరచ్చ చేసిన స్వీటీ

రచ్చరచ్చ చేసిన స్వీటీ

వడోదరాలో భార్యతో, అహమ్మదాబాద్ లో స్వీటీతో కాపురం చేసిన సీఐ అజయ్ దేశాయ్ ఇంతకాలం ఎంజాయ్ చేశాడు. గ్రహాలు అనుకూలించకపోవడంతో మూడు నెలల క్రితం అజయ్ దేశాయ్ కు మరో యువతితో పెళ్లి జరిగిందని అతని ప్రియురాలు స్వీటీ పటేల్ కు తెలిసిపోయింది. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ బిడ్డకు తల్లిని చేసి మరో యువతిని ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ స్వీటీ పెద్ద గొడవ చేసింది.

స్వీటీని చంపేసిన సీఐ ప్రియుడు

స్వీటీని చంపేసిన సీఐ ప్రియుడు

జూన్ 4వ తేదీన స్వీటీ నివాసం ఉంటున్న ఫ్లాట్ కు ఆమె ప్రియుడు అజయ్ దేశాయ్ వెళ్లాడు. నీ భార్యకు విడాకులు ఇచ్చి తనను అధికారికంగా పెళ్లి చేసుకోవాలని, లేదంటే నీ మీద కేసు పెట్టి నీ ఉద్యోగం ఊడిపోయేలా చేస్తానని స్వీటీ పెద్ద గొడవ చేసింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన అజయ్ దేశాయ్ అతని ప్రియురాలు స్వీటీని చంపేశాడు. స్వీటీ ప్రాణం పోయిందని అజయ్ దేశాయ్ నిర్దారించుకున్నాడు.

 హోటల్ పక్కన స్వీటీ శవం కాల్చేశాడు

హోటల్ పక్కన స్వీటీ శవం కాల్చేశాడు

స్వీటీ శవాన్ని దుప్పటిలో చుట్టిన అజయ్ దేశాయ్ అతని ఎస్ యూవీ కారు అపార్ట్ మెంట్ లోకి తీసుకెళ్లి శవాన్ని అందులో పెట్టాడు. ఆ సమయంలో ఆ తతంగం మొత్తం, సీఐ అజయ్ దేశాయ్ రెండో యాంగిల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. తరువాత స్వీటీ శవాన్ని నేరుగా స్నేహితుడు, కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన జడేజా కు చెందిన దహేజా ప్రాంతంలోని ఓ హోటల్ దగ్గరకు తీసుకెళ్లాడు. హోటల్ పక్కన నిర్మాణంలో ఉన్న భవనం పక్కల స్వీటీ శవం మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. అజయ్ దేశాయ్ పోలీసు అధికారి కావడంతో సాక్షాలు, హత్యకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

 ఏమాత్రం పట్టించుకోని సీఐ

ఏమాత్రం పట్టించుకోని సీఐ

స్వీటీ నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడంతో ఆమె సోదరుడు జయదీప్ పటేల్ తన సోదరి కనపడటం లేదని పోలీసులను ఆశ్రయించాడు. స్వీటీ, సీఐ అజయ్ అక్రమ సంబంధం గురించి ఆమె సోదరుడు పోలీసులకు చెప్పాడు. స్వీటీ కనపడలేదని సీఐ అజయ్ దేశాయ్ కి ఏ మాత్రం దిగులులేదు. పోలీసుల విచారణ జరుగుతున్న సమయంలో స్వీటీ హత్య కేసు దర్యాప్తు ఎలా జరుగుతుందో ముందే తెలుసుకుంటున్న అజయ్ దేశాయ్ పోలీసులకు ఎలాంటి క్లూ చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. స్వీటీ కనపడకుండా పోయిన 40 రోజుల తరువాత ఆ కేసును క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించడంతో అజయ్ దేశాయ్ కు దిగులు పట్టుకుంది.

 నార్కో పరీక్షలతో అసలు బండారం !

నార్కో పరీక్షలతో అసలు బండారం !

క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అజయ్ దేశాయ్ కి నార్కో పరీక్షలు నిర్వహించాలని సిద్దం కావడంతో స్వీటీ ప్రియుడు మొదట ఓకే అన్నాడు. నార్కో పరీక్షల్లో తానే హత్య చేశానని బయటపడుతుందని గ్రహించిన సీఐ అజయ్ దేశాయ్ తరువాత నార్కో పరీక్షలు చేయించుకోనని రివర్స్ అయ్యాడు. అప్పుడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అజయ్ దేశాయ్ మీద మరింత అనుమానం ఎక్కువ అయ్యింది. నీ అంతకు నువ్వు స్వీటీని హత్య చేసినట్లు అంగీకరిస్తే సరే, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

 సీఐ భార్యకు ఇంత వరకు డౌట్ రాలేదు

సీఐ భార్యకు ఇంత వరకు డౌట్ రాలేదు

క్రైమ్ బ్రాంచ్ దెబ్బతో స్వీటీని తానే హత్య చేశానని అజయ్ దేశాయ్ అంగీకరించాడని గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు తెలిపారు. సీఐ అజయ్ దేశాయ్ కి స్వీటీ అనే మహిళతో అక్రమ సంబంధం ఉంది అనే విషయం ఆయన భార్యకు ఇంత వరకూ తెలీదని పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+