IPL 2023 : ఐపీఎల్ లో శ్రీశాంత్ రీఎంట్రీ ! పదేళ్ల తర్వాత కొత్త పాత్రలో కేరళ మాజీ పేసర్..
2013 ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ కు దూరమైన శ్రీశాంత్.. పదేళ్ల విరామం తర్వాత కొత్త పాత్రలో మెరవబోతున్నాడు..
ఒకప్పుడు తన పదునైన బంతులతో బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన కేరళ పేస్ సంచలనం శ్రీశాంత్.. భారత జట్టులోకి కూడా అంతే వేగంతో దూసుకొచ్చాడు. అయితే 2013 ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్ ప్రతిష్ట మసకబారింది. అప్పటి నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్న శ్రీ ఇప్పుడు తిరిగి ఐపీఎల్ లో రీఎంట్రీకి సిద్దమయ్యాడు. రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023లో శ్రీశాంత్ రీఎంట్రీ ఖరారైంది.
2013 ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల తర్వాత క్రికెట్ దూరమైన శ్రీశాంత్.. పదేళ్ల విరామం తర్వాత తిరిగి ఐపీఎల్ లో కనిపించబోతున్నాడు. అయితే ఈసారి క్రికెటర్ గా కాకుండా క్రికెట్ వ్యాఖ్యతగా కావడం విశేషం. ఐపీఎల్ ప్రసార హక్కులు పొందిన స్టార్ స్పోర్ట్స్ తాజాగా ప్రకటించిన కామెంటేటర్ల జాబితాలో శ్రీశాంత్ కూడా ఉన్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఈసారి ఐపీఎల్ కోసం స్టార్ స్పోర్ట్స్ ఎంపిక చేసుకున్న మాజీ క్రికెటర్ల జాబితాలో శ్రీశాంత్ కు కూడా స్ధానం లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈసారి ఐపీఎల్ కోసం స్టార్ స్పోర్ట్స్ ఎంచుకున్న కామెంటేటర్ల జాబితాలో శ్రీశాంత్ తో పాటు జాక్వెస్ కల్లిస్, ఆరోన్ ఫించ్, కెవిన్ పీటర్సన్, టామ్ మూడీ, ఇర్ఫాన్ పఠాన్, ఎస్ శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్, పాల్ కాలింగ్‌వుడ్, హర్భజన్ సింగ్, మురళీ విజయ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్ వంటి దిగ్గజ క్రికెటర్లు కూడా ఉన్నారు. వారితో కలిసి ఈసారి కామెంట్రీ బాక్సులో శ్రీశాంత్ దర్శనమివ్వబోతుండటం ఆయన అభిమానుల్లో సంతోషం నింపుతోంది.
2013లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ కు దూరమైన శ్రీశాంత్.. ఇతర రంగాల్లో మాత్రం తన ఉనికి చాటుకుంటూనే ఉన్నాడు. ఇందులో రియాల్టీ షోలతో పాటు కొన్ని సినిమాల్లోనూ మెరిశాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శ్రీశాంత్ తిరిగి కామెంటేటర్ పాత్రలో ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా సందడి చేయబోతున్నాడు. రియాల్టీ షోలతో అభిమానుల్ని సంపాదించుకున్న శ్రీశాంత్ ఐపీఎల్ రీఎంట్రీలో ఏమేరకు ఆకట్టుకుంటాడో త్వరలో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications