IPS: అమ్మాయిపై లైంగిక దాడి, జిల్లా ఎస్పీగా పోస్టింగ్, ఇంట్లో న్యూఇయర్ పార్టీ ఎఫెక్ట్, కోర్టులో పెండింగ్ !

అసోం/హైదరాబాద్: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారికి జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించడం హాట్ టాపిక్ అయ్యింది. న్యూ ఇయర్ పార్టీకి ఇంటికి పిలిచి మైనర్ ను లైంగికంగా చిత్రహింసలకు గురి చేశారని ఆ ఐపీఎస్ అధికారి మీద కేసు నమోదు అయ్యింది. మైనర్ మీద లైంగిక దాడి చేశారని సాటి పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. అమ్మాయి తల్లి కూడా పోలీసు అధికారి కావడంతో కలకలం రేపింది. ఇప్పటికే ఐపీఎస్ అధికారి మీద విచారణ పూర్తి చేసి కోర్టులో నివేదిక సమర్పించారు. ఇలాంటి సమయంలో లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ కు బాధ్యతలు అప్పగించడం కలకలం రేపింది. పోలీసు అధికారి నేరం చేశాడని కోర్టులో ఇంకా రుజువు కాలేదని, హోం శాఖ ఆదేశాలలతో మేము ఆయనకు బాధ్యతలు అప్పగించామని ఆ రాష్ట్ర డీజీపీ చెప్పడంతో ప్రజలు షాక్ అయ్యారు.

 మైనర్ అమ్మాయిపై ఐపీఎస్ పంజా ?

మైనర్ అమ్మాయిపై ఐపీఎస్ పంజా ?

అసోంలోని ఓ ఐపీఎస్ అధికారి 13 ఏళ్ల అమ్మాయి (మైనర్) మీద లైంగిక దాడికి పాల్పాడ్డాడని ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులను విచారణ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు విచారణ జరిపి ఆ ఐపీఎస్ అధికారి మీద మార్చి 31వ తేదీన చార్జ్ షీటు దాఖలు చేశారు.

 ఇంతలో ఏం జరిగింది ?

ఇంతలో ఏం జరిగింది ?

ఐపీఎస్ అధికారి మీద మార్చి 31వ తేదీ చార్జ్ షీట్ దాఖలు కాకముందే ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, సీనియర్ పోలీసు అధికారులు ఐపీఎస్ అధికారి విషయంలో చక్రం తిప్పారని ఆరోపణలు ఉన్నాయి. మార్చి 14వ తేదీన ఆ ఐపీఎస్ అధికారికి అసోంలోని గౌహతి జిల్లా ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

 కేసు విచారణలో ఉంది

కేసు విచారణలో ఉంది

ఐపీఎస్ అధికారి మీద కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసు అధికారులు అసోంలోని కమర్రుపా మెట్రోపాలిటిన్ ప్రత్యేక కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారికి జిల్లా ఎస్పీగా ఎలా బాధ్యతలు అప్పగిస్తారు అంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

 ఆ రోజు ఏం జరిగిందంటే ?

ఆ రోజు ఏం జరిగిందంటే ?

2019 డిసెంబర్ 31వ తేదీన నిందితుడి నివాసం (ఐపీఎస్ అధికారి ఇల్లు)లో ఓ పార్టీ జరిగింది. ఆ పార్టీకి అసోం సీనియర్ మహిళా పోలీసు అధికారి, ఆమె 13 ఏళ్ల కూతురు హాజరైనారు. ఆ సమయంలో నిందితుడు అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డారని కేసు నమోదు అయ్యింది. 2020 జనవరి 3వ తేదీన 13 ఏళ్ల అమ్మాయి మీద ఆ ఐపీఎస్ అధికారి లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆమె తల్లి మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

 నేరం రుజువు కాలేదు కదా ?

నేరం రుజువు కాలేదు కదా ?

మొదట ఈ కేసు అసోం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరిపారని, తరువాత ఆ కేసు అసోం సీఐడీకి బదిలి అయ్యిందని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తలు ప్రసారం చేసింది. నిందితుడు నేరం చేసినట్లు ఇంకా రుజువు కాలేదని, కేసు విచారణలో ఉన్నందున ఆయన సేవలు మేము ఉపయోగించుకుంటున్నామని అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా స్థానిక మీడియాకు చెప్పారు. ఓ పక్క కరోనా వైరస్, మరో పక్క లాక్ డౌన్ కష్టాలు ఉండటం వలనే లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారికి మళ్లీ పోస్టింగ్ ఇచ్చారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+