వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం: ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించిన ఐపీఎస్ అధికారి

|
Google Oneindia TeluguNews

కోల్ కత: సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు ముఖ్యమంత్రి పాదాలను నమస్కరించిన ఉదంతం కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో ఉంటూ.. యూనిఫాం ధరించి మరీ ముఖ్యమంత్రికి పాద నమస్కారం చేయడం వివాదాలను రేకెత్తిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 21వ తేదీన ఈస్ట్ మిడ్నాపూర్ లోని దిఘాలో నిర్వహించిన పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయివుండీ.. యూనిఫాంలో ముఖ్యమంత్రి పాదాలను నమస్కరించడంపై పలువురు పోలీసు అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వారు ఆ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీని ముద్దాడిన మలయాళీ యువకుడు!రాహుల్ గాంధీని ముద్దాడిన మలయాళీ యువకుడు!

ఆ అధికారి పేరు రాజీవ్ మిశ్రా. పశ్చిమ బెంగాల్ లో ఐజీ ర్యాంకులో పనిచేస్తున్నారు. పశ్చిమ రేంజ్ విభాగాధిపతిగా ఉన్నారు. ఈ నెల 21వ తేదీన మమతా బెనర్జీ ఈస్ట్ మిడ్నాపూర్ రేంజ్ లోని దిఘా పర్యటనకు వెళ్లారు. అదే రోజు వినీత్ గోయెల్ అనే ఐపీఎస్ అధికారి జన్మదినం కావడంతో మమతా బెనర్జీ కేక్ ను తెప్పించారు. వినీత్ గోయెల్ తో కట్ చేయించారు. వినీత్ గోయెల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తాను స్వయంగా వినీత్ గోయెల్ కు కేక్ తినిపించారు. అదే కేక్ ను ఆయన పక్కనే ఉన్న రాజీవ్ మిశ్రాకు తానే తినిపించారు. ఈ సందర్భంగా రాజీవ్ మిశ్రా మమతా బెనర్జీ పాదాలను నమస్కరించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొందరు చిత్రీకరించిన వీడియోలో ఈ దృశ్యం రికార్డయ్యింది. ఆ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

IPS officer touches Bengal CM Mamata Banerjees feet in uniform, courts controversy

పోలీసు అధికారి చర్యలపై భారతీయ జనతాపార్టీ విమర్శలు గుప్పిస్తోంది. మమతా బెనర్జీ.. పోలీసు యంత్రాంగం మొత్తాన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారనడానికి ఈ వీడియోనే సాక్ష్యమంటూ విమర్శిస్తున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని ఆమె పరిపాలన సాగిస్తున్నారని బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. కొందరు సీనియర్ పోలీసు అధికారులు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు సైతం రాజీవ్ మిశ్రా చేసిన చర్యను తప్పు పడుతున్నారు. మమతా బెనర్జీ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని ప్రదర్శించుకోవడానికి ఆయనకు ఇంతకంటే మంచి సందర్భాలు, వేదికలు చాలానే ఉన్నాయని అంటున్నారు. యూనిఫాంలో ఉంటూ ఓ ముఖ్యమంత్రి పాదాలను నమస్కరించడం వల్ల ఐపీఎస్ హోదాను దిగజార్చినట్టయిందని చెబుతున్నారు.

English summary
An IPS officer in uniform was seen touching West Bengal chief minister Mamata Banerjee’s feet in a video clip which triggered a controversy among other police officers. The video was taken by one of the few Trinamool leaders and bureaucrats present at the seashore in East Midnapore's Digha, where Banerjee went on August 21 to hold an administrative meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X