irctc కోస్టల్ కర్ణాటక ప్యాకేజ్
వేసవికాలంలో అందమైన పర్యాటక ప్రదేశాలను చూసిరావాలనుకునేవారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) శుభవార్త వినిపించింది. హైదరాబాద్ నుండి కర్ణాటకకు వెళ్లే ప్రయాణికుల కోసం 'కోస్టల్ కర్ణాటక' పేరుతో ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా పేరుపొందిన పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించవచ్చు. ఈ నెల నుంచి ఈ ప్యాకేజీ అమల్లో ఉంది. ప్రతి మంగళవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6:05 గంటలకు రైలు బయలుదేరుతుంది.
ప్యాకేజీ ధరలు ఎలా ఉంటాయంటే
* 6 పగళ్లు, 5 రాత్రులు ఉంటుంది.
* స్టాండర్డ్ కేటగిరి, 3 ఏసీ, స్లీపర్ క్లాస్ లు అందుబాటులో ఉంటాయి.
* ప్యాకేజీ ధరలు రూ.11,600 నుంచి రూ.34,270 వరకు
* మురుడేశ్వర్, మంగళూరు, సెయింట్ మేరేస్ ద్వీపం, మల్పే బీచ్, జోగ్ జలపాతం వీక్షిస్తారు.
* శ్రీ కృష్ణ ఆలయం, శారదాంబ ఆలయం, మూకాంబిక ఆలయం, గోకర్ణలోని మురుడేశ్వర్ ఆలయం, కటీల్ ఆలయం , మంగళ దేవి ఆలయం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు చూడొచ్చు.
* ఈ ప్యాకేజీలో ప్రయాణికులకు మూడు రాత్రుల వసతి, అల్పాహారం, ప్రయాణ బీమా ఉంటుంది. ఏసీ వాహనం అందుబాటులో ఉంటుంది.

మురుడేశ్వర్ ఆలయ గాలి గోపురం 20 అంతస్తులు ఉంటుంది. కందుక పర్వతం మీద మూడువైపులా అరేబియా సముద్రంతో నిండివుంటుంది. దేవాలయానికి వెళ్లే మార్గంలో నిజమైన ఏనుగులు కూడా రెండు ఉంటాయి. ఆలయ సముదాయంలో శివుడి విగ్రహం ఉంటుంది. 40 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద శివుడి విగ్రహం ఇది. 123 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ విగ్రహాన్ని శివమొగ్గకు చెందిన కాశీనాథ్, ఆయన కుమారుడు శ్రీధర్, ఇతర శిల్పులు కలిసి కోటిరూపాయల ఖర్చుతో దీన్ని చెక్కించారు. సూర్య రశ్మి పడినప్పుడల్లా విగ్రహం మెరుస్తుంది.












Click it and Unblock the Notifications