మద్యం మత్తు: భోజనం బాగోలేదని భార్యను చంపేశాడు

మాన్పూర్ పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం దినేష్ (33) తన ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత భార్య లలిత అలియాస్ కాళీ అతనికి భోజనం వడ్డించింది. మద్యం మత్తులో ఊగిపోతున్న దినేష్ భోజనం బాగోలేదని భార్యతో గొడవకు దిగాడు.
కొద్దిసేపు భార్య లలితతో ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ఆగ్రహానికి గురైన దినేష్ తనకు దొరికిన పదునైన ఆయుధం(కొడవలి)తో భార్యపై దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో భార్య లలితకు తీవ్ర గాయాలయ్యాయి. లలిత అరుపులు విన్న ఇతర కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆమెను మన్పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
కాగా తీవ్రగాయాలపాలైన లలిత మార్గమధ్యలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు దినేష్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. మౌ కోర్టు ముందు నిందితుడ్ని ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications