ఇరోమ్ షర్మిళ పెళ్లికి.. తోడు పెళ్లికూతురిగా 'కక్కూస్' డైరెక్టర్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: 16ఏళ్ల తన సుదీర్ఘ పోరాటానికి వీడ్కోలు చెప్పిన ఇరోమ్ షర్మిళ.. ఎన్నికల రాజకీయంలో భంగపడ్డ సంగతి తెలిసిందే. ఏ ప్రజల కోసమైతే తన జీవితాన్ని పణంగా పెట్టిందో ఆ ప్రజలే తనను తిరస్కరించాక.. ఇక ప్రజా జీవితాన్ని విడనాడాలని ఆమె నిర్ణయించుకున్నారు.

ఇన్నాళ్లు కోల్పోయిన వ్యక్తిగత జీవితాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే ఆమె వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 16న బ్రిట‌న్‌కు చెందిన డెస్మండ్ కౌటిన్హోను ష‌ర్మిళ పెళ్లిచేసుకోనున్నారు. నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే విషయంలోను ఆమెను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.

 irom Sharmila invites ‘Kakkoos’ director to be her bridesmaid for her August 16 wedding

ఇతర మతస్తుడు, అందునా విదేశీయుడిని పెళ్లి చేసుకుంటారా? అంటూ కొంతమంది కోర్టులకెక్కుతున్నారు. ఇదిలా ఉంటే, షర్మిల పెళ్లి వేడుకలో తోడు పెళ్లి కూతురిగా దర్శకురాలు దివ్య భారతి ఉండనున్నారు. ఈ మేరకు ఉక్కు మహిళ షర్మిళ ఆమెకు ఆహ్వానం పంపించారు.

కక్కూస్ అనే డాక్యుమెంటరీ ద్వారా అణగారిన వర్గాల జీవితాన్ని దివ్యభారతి కళ్లకు కట్టినట్లు చూపించారు. దేశవ్యాప్తంగా ఈ డాక్యుమెంటరీ పెద్ద సంచలనమే సృష్టించింది. పౌర హక్కుల సంఘం తరుపున 2009లో ఓ లా కాలేజీ విద్యార్థి మృతి సమయంలోను ఆమె పోరాటం చేసింది.

అతనికి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ఆమె చేసిన ఆందోళనకు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి.
తాజాగా ఇరోమ్ షర్మిళ వివాహానికి ఆమె తోడు పెళ్లి కూతురుగా వ్యవహరిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Internationally renowned human rights activist Irom Sharmila on Wednesday expressed solidarity with documentary film maker Divya Bharathi
Please Wait while comments are loading...