వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓడిపోతేనే పెళ్లి.. లేదంటే..! : ఉక్కు మహిళ

|
Google Oneindia TeluguNews

ఇంఫాల్ : ఓ సుదీర్ఘ ప్రయాణం తర్వాత మొదలయ్యే అంతర్మథనం.. మనిషిని జంక్షన్ లో నిలబెట్టి ఎటువైపో తేల్చుకోవాల్సిన అనివార్యతలో నిలబెడుతుంది. ఆశయం కోసం అలుపెరగకుండా పోరాడినోళ్లకు.. జనం అండ ఉంటే.. ఆ ప్రస్థానం మరింత కాలం కొనసాగుతుంది. లేదంటే.. ఉక్కు మనిషి సైతం సామాన్యురాలిగా మారిపోవాల్సిన పరిస్థితి. ఒకరకంగా.. ఇది సమాజం వాళ్లకిచ్చే అవమాన బహుమానం.

ఇప్పుడీ మాటలన్నీ మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిలా గురించే. 16 ఏళ్ల సుదీర్ఘ నిరాహార దీక్షకు ఫుల్ స్టాప్ పెట్టిన ఆమె.. నా పోరాట పంథాను రాజకీయాల ద్వారా కొనసాగించాలనుకుంటున్నాను.. అన్న బలమైన కాంక్షను అక్కడి ప్రజల ముందు పెట్టింది. దీనికి తిరస్కణ ఎదురైతే.. సామాజిక లక్ష్య పోరాటాన్ని పక్కనబెట్టి.. పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడిపోతానని చెబుతున్నారు షర్మిల.

చెమర్చిన కళ్లతో ఆమె ఈ మాటలు అంటుంటే.. అక్కడ ఎన్ని హ్రుదయాలు చలించాయో తెలియదు గానీ రాష్ట్రంలో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని.. 16 ఏళ్ల జీవితాన్ని త్యాగం చేసిన ఆమె కోసం అక్కడి ప్రజలు ఎలాంటి భవిష్యత్ సంసిద్దతోని ఉన్నారన్నది ఇప్పుడు అందరి మదిలో తలెత్తుతున్న ప్రశ్న.

Irom Sharmila to wed only if voters reject her

భవిష్యత్తు రాజకీయాలకు అక్కడి ప్రజలు షర్మిలకు అవకాశం ఇస్తారా.. లేక విలువల్లేని మరుగుజ్జు రాజకీయాల్లో ఆమెను కూడా మరుగుజ్జును చేస్తారా.. అన్న చర్చ ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తోంది. ఏదేమైనా దీక్ష విరమించిన షర్మిల మాత్రం.. కాసింత గంజి, హార్లిక్స్ తీసుకోవడం ద్వారా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది.

మంగళవారం నాడు షర్మిలకు బెయిల్ మంజూరైన సందర్బంలో.. తాను పెళ్లాడబోయే ప్రియుడు మాత్రం అక్కడి పరిసరాల్లో కనిపించలేదు. ఇకపోతే.. తన రాజకీయ ప్రస్థానానికి వేదికను కూడా ప్రకటించిన షర్మిల 2017లో తౌబల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత సీఎం ఓక్రొమ్ ఇబోబి సింగ్ కూడా ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం.

ఇవన్నీ పక్కనబెడితే.. సాయుధ దళాల ప్రత్యేక చట్ట పోరాటాన్ని నీరు గార్చేందుకే ఆమెను రాజకీయాల్లోకి దించుతున్నారన్న ఆరోపణలు సైతం ఇప్పుడు షర్మిల ఎదురుకోవాల్సి వస్తోంది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయాలు షర్మిలకు ఎలాంటి దిశా నిర్దేశం చేస్తాయో!

English summary
Renowned civil rights activist Irom Sharmila, who ended her 16-year-long hunger strike+ against AFSPA+ on Tuesday, said she would only get married if people reject her fresh innings as a politician.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X