షాక్: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ బీజేపీలో చేరుతున్నారా?
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. అయితే, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఆనంద్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అందుబాటులోకి రాలేదని సమాచారం. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న ఆయన బీజేపీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. విజయ్‌నగర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఆయన గెలుపొందారు.

ఇది ఇలా ఉంటే, ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. అయితే, వీరు ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వీరు తమతో ఉన్నారని చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్‌కు 38 సీట్లు వచ్చాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గురువారం సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications