నిఠారి కిల్లర్ కోలీకి మరోసారి స్టే, ఉరిశిక్ష బాధిస్తుందా?
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన నోయిడాలోని నిఠారి వరుస హత్యల కేసులో సురేందర్ కోలీ (42)కి తన ఉరిశిక్ష వణుకు పుట్టిస్తోంది. నిఠారి వరుస హత్యల కేసులో దోషిగా తేలిన కోలీకి ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఐతే, ఉరిశిక్ష పడిన వారికి ఓపెన్ కోర్టులో క్షమాభిక్ష కోసం అప్పీల్ చేసుకునే హక్కు ఉంటుందన్న మానవీణ కోణంలో సురీందర్ కోలీ ఉరిశిక్షను వారం పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్. దత్తు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ రోజు క్షమాభిక్ష పిటిషన్‌పై విచారణను జరిపిన సుప్రీంకోర్టు మరోసారి స్టే విధించింది. తాజాగా అక్టోబర్ 29 వరకు స్టే ఇచ్చింది. అంతేగాక సురీందర్ కోలీ దాఖలు చేసిన పిటిషన్ పై రివ్యూ జరిపేందుకు అంగీకరించిన సుప్రీం కోర్టు అక్టోబర్ 28న విచారణ చేపడతామని పేర్కొంది. నిజానికి ఈ వారమే అతనికి ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జైల్లో ఉరికశిక్ష అమలు కావల్సి ఉంది.

ఇలాంటి తరుణంలో సురీందర్ కోలీకి ఉరిశిక్ష ఎలా ఉంటుందోనన్న భయం పట్టుకుంది. ఉరిశిక్ష వేసినప్పుడు నొప్పి కలుగుతుందా? అని అడుగుతున్నాడని జైలు అధికారులు తెలిపారు. తనకు ఉరిశిక్ష ఎప్పుడు అమలు చేస్తున్నారని పదే పదే అడుగుతున్నాడని తెలిపారు. ఢిల్లీ శివార్లలో ఉండే నోయిడాలోని నిఠారి ప్రాంతంలో మణీందర్ సింగ్ పాంధర్ అనే వ్యక్తి ఇంట్లో కోలీ పని చేసేవాడు. ఆ సమయంలో దాదాపు 19 మంది అమ్మాయిలను అత్యాచారం చేసి చంపేశాడు. ఇందులో కొంతమందిని హత్య చేసి ఆ తర్వాత అనుభవించాడు.
రింపా హల్దార్ అనే 14 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో వీరిద్దరిని దోషులుగా కోర్టు తేల్చింది. ఢిల్లీ సమీపంలోని నోయిడా శివార్లలోని నిఠారీ గ్రామంలో ఈ హత్యలు జరిగాయి. ఈ కేసుల్లో భాగంగా ఒక బాలిక కేసులో మాత్రమే ఘజియాబాద్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేందర్ సింగ్ కోలీ నేరాన్ని అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెల్సిందే. కోలీకి పంథర్ సహకరించినట్టు సీబీఐ పూర్తి సాక్ష్యాధారాలను సమర్పించింది. యజమాని పాంథర్‌కు మాత్రం క్లీన్ చిట్ ఇచ్చింది. రింపా హత్య జరిగినపుడు తాను ఆస్ట్రేలియాలో ఉన్నట్టు పాంథర్ కోర్టుకు తెలియజేశాడు.












Click it and Unblock the Notifications