• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కవ్వించి, చచ్చిపోయారా? ఆ ట్వీట్ కు అర్థమేంటి? భారత మెరుపు దాడులకు ఆ సింగిల్ లైన్ ట్వీటే కారణమా?

|

న్యూఢిల్లీ: ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, ఉరుము లేని పిడుగులాగా జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడులకు ఒకే ఒక్క ట్వీట్ కారణమని తెలుస్తోంది. మనదేశాన్ని, మనదేశ రక్షణను ఉద్దేశించి ఆ ట్వీట్ చేసినట్టుగా చెబుతున్నారు. ఆ ఒక్క ట్వీట్ వల్లే భారత్ వైమానిక దాడులకు దిగిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇందులో అనేక భిన్న వాదనలు ఉన్నాయి. ఆ ట్వీట్ అధికారికంగా వెలువడినది కాదనే వాదన వినిపిస్తోంది. ఆ ట్వీట్ లో ఉన్న సారాంశం ప్రకారం.. ముందస్తుగా హెచ్చరికలు చేయాల్సిన అవసరం కూడా పాక్ అధికారులకు ఉండకపోవచ్చని అంటున్నారు.

Is that tweet leads to IAF strikes, which is posted in Pakistan Defence twitter?

ఇంతకీ ఏమిటా ట్వీట్..?

స్లీప్ టైట్..బికాజ్ పీఎఎఫ్ (పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్) ఈజ్ అవేక్.. అనేది సింగిల్ లైన్ ట్వీట్. జాగ్రత్తగా నిద్రపోండి..ఎందుకంటే పీఎఎఫ్ అప్రమత్తమైంది.. అనేది దాని సారాంశం. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత అంటే.. 12:06 నిమిషాలకు ఆ ట్వీట్ పోస్ట్ అయింది. పాకిస్తాన్ డిఫెన్స్ అనే ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ అయ్యిందది. టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న పాకిస్తాన్ యుద్ధ విమాన ఫొటోకు ఈ క్యాప్షన్ ను జోడించి ట్వీట్ చేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అనే పదాలకు హ్యాష్ ట్యాగ్ ను జోడించి, పోస్ట్ చేశారు. ఇదే ఫొటో, ఇదే క్యాప్షన్.. పాకిస్తాన్ డిఫెన్స్ పేరు మీద ఉన్న ఫేస్ బుక్ ఖాతాల్లోనే పోస్ట్ అయ్యాయి.

Is that tweet leads to IAF strikes, which is posted in Pakistan Defence twitter?

కవ్వింపు చర్యగా భావించవచ్చా?

ఈ ట్వీట్ ను చూసిన వెంటనే మనదేశ వైమానిక దళాలు అప్రమత్తం అయ్యాయా? దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయా? అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. నిజానికి- ఏ క్షణంలోనైనా యుద్ధం చేయడానికి, నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడానికి భారత వైమానిక దళం సర్వ కాల సర్వావస్థల్లోనూ సిద్ధంగా ఉంది. పుల్వామా ఉగ్రవాదుల దాడి తరువాత రాజస్థాన్ లో భారత్-పాక్ సరిహద్దుల సమీపంలో వైమానిక దళం నిర్వహించిన యుద్ధ విన్యాసాలే దీనికి నిదర్శనం. దాడులు ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అనేది సైన్యమే నిర్ణయించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా స్వేచ్ఛనిచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉన్న వైమానిక దళం అధికారులు ఈ ట్వీట్ ను చూడగానే దాడులు చేశారా? తమను పాక్ వైమానిక అధికారులు కవ్విస్తున్నారని భావించిన మనదేశం వైమానిక దాడులకు దిగిందా? అనే సందేహాలు తలెత్తక మానవు. పాకిస్తాన్ డిఫెన్స్ కు సంబంధించిన అధికారిక ట్విట్టర్ అకౌంట్ మనదేశంలో అందుబాటులో ఉండదు. ప్రస్తుతం పోస్ట్ చేసిన ట్వీట్.. అధికారికంగా చేసి ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ ట్వీట్ లో ఉన్న సారాంశం ప్రకారం.. నిజంగా మనదేశంపై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు దాడులు చేయాలని అనుకుంటే.. ముందస్తు హెచ్చరికలు చేయాల్సిన అవసరం ఆ దేశానికి ఉండదని అంటున్నారు. ఏదేమైనప్పటికీ.. ఈ ట్వీట్ పోస్ట్ అయిన మూడున్నర గంటల వ్యవధిలో భారత వైమానిక దళం ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేయడం చర్చనీయాంశమైంది. అందరి దృష్టినీ ఆకట్టుకుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Is a single line tweet posted in Pakistan Defence twitter leads to IAF strikes?. A widely discussion going on this issue across the country. Tweet contain that the matter of sleep tight because PAF is awake. It was posted at just six minutes after Mid night of the Monday. Is this tweet main reason to IAF stikes on terror camps along with LoC, a brief discussion in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more