ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అప్ప ఫైర్ !
బెంగళూరు/మంగళూరు: లింగాయత్ సీఎం అవినీతిపరుడు అని ఆరోపణలు చేసిన మాజీ సీఎం సిద్దరామయ్య లింగాయత్ కులం మొత్తాన్ని అవమానించారని మాజీ ముఖ్యమంత్రి బీఎస్, యడియూరప్ప మండిపడ్డారు. కర్ణాటక గురించి రాహుల్ గాంధీకి ఏమి తెలుసు ?, ఎన్నికల సమయంలో యువరాజు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాడని యడియూరప్ప ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి ఏమైనా పోలిక ఉందా, ఇద్దరి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, మోదీ ముందు రాహుల్ గాంధీ ఏమాత్రం పనికిరారని, ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో ముస్లీంల రిజర్వేన్ల రద్దను మొదట తాను స్వాగతించానని, అయితే ముస్లీం రిజర్వేన్ల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము గౌరవిస్తున్నామని, కోర్టు ఆదేశాలు, తీర్పుకు తాము కట్టుబడి ఉంటామని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు. ముస్లీం రిజర్వేషన్ల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా తాము గౌరవిస్తామని యడియూరప్ప అన్నారు.

కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 140 స్థానాల్లో విజయం సాధించి మరోసారి మేమే అధికారంలోకి వస్తామని మాజీ సీఎం యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో మేమే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, వారి కలలు పగటి కలలుగానే మిగిలిపోతాయని మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప వ్యంగంగా అన్నారు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు వరకు తాను ఎన్నికల ప్రచారం చేస్తానని, 70 అసెంబ్లీ నియోజక వర్గాల్లో తాను రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటానని యడియూరప్ప వివరించారు. కాంగ్రెస్ లో వర్గ పోరు మొదలైయ్యిందని, మాజీ సీఎం సిద్దరామయ్య ఓ దిక్కు, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మరో దిక్కు వెలుతున్నారని యడియూరప్ప ఆరోపించారు.
2013 నుంచి 2018 మధ్య కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నీటి పారుదల శాఖలో భారీ అవినీతికి పాల్పడిందని, బీడీఏ స్కామ్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం పరుపులు, దిండ్లు కొనుగోలు చెయ్యడానికి భారీ మొత్తంలో లంచాలు తీసుకుందని, ఆ మధ్య కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 100కు 100 శాతం అవినీతికి పాల్పడిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications