వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీ టీచర్: కేరళలో ఐఎస్ఐఎస్ రిక్రుట్ మెంట్లు

|
Google Oneindia TeluguNews

కొచ్చి: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కేరళలో పట్టుసాధిస్తున్నదని సమాచారం. అత్యంత రహస్యంగా యువతను కలిసి వారిని ఉగ్రవాదం వైపుఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసు అధికారులు అంటున్నారు.

కేరళలోని ఓ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్న యాస్మిన్ అహమ్మద్ (28) అనే మహిళ ఐఎస్ఐఎస్ వలలో చిక్కుకున్న విషయం తెలిసిందే. గత వారం ఈమెను ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

విచారణలో యాస్మిన్ అహమ్మద్ సంచలనాత్మక వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు తాను దాదాపు 40 మందికి జీహాద్ సిద్దాంతాలను నూరిపోసినట్లు ఆమె అంగీకరించిందని అధికారులు అంటున్నారు.

రషీద్ రిక్రూటర్

రషీద్ రిక్రూటర్

యాస్మిన్ పోలీసుకు చెప్పిన వివరాల ప్రకారం అబ్దుల్ రషీద్ అనే ఐఎస్ఐఎస్ రిక్రూటర్ ఉగ్రవాదంపై క్లాసులు నిర్వహించాడని, ప్రస్తుతం అతను ఆఫ్ఘనిస్థాన్ నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని ఆమె పోలీసులకు చెప్పింది.

రషీద్ కోసం వెలుతుంటే

రషీద్ కోసం వెలుతుంటే

రషీద్ ను కలవడానికి ఆఫ్ఘనిస్థాన్ వెలుతున్న సమయంలో ఆమె పోలీసులకు చిక్కిపోయింది. కేరళ సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఈ విషయంపై స్పందించారు. కర్ణాటక-కేరళ సరిహద్దులోని కాసరగూడులోని త్రిక్కరిపూర్ ప్రాంతంలో ఉగ్రవాదంపై క్లాసులు నిర్వహించారని అన్నారు.

క్లాసులకు వెళ్లిన వారిపై నిఘా

క్లాసులకు వెళ్లిన వారిపై నిఘా

ఆ క్లాసులకు హాజరైన వారిని ఇప్పటికే కొందరిని గుర్తించామని, వారి మీద నిఘా వేశామని చెప్పారు. యాస్మిన్ అహమ్మద్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కోసం రిక్రూట్ మెంట్లు చేస్తున్నదని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

రూ. రెండు నెలలు, 21 మంది మాయం

రూ. రెండు నెలలు, 21 మంది మాయం

గత సంవత్సరం మే, జూన్ నెలల్లో కేరళలో 21 మంది అదృశ్యం అయ్యారు. వీరి అదృశ్యం వెనుక రషీద్ ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారితో పాటు యాస్మిన్ వెళ్లలేకపోయింది.

పాప కోసం

పాప కోసం

యాస్మిన్ కు నాలుగు నెలల పాప ఉందని, ట్రావెల్ డాక్యుమెంట్ ల జారీలో సమస్యలు రావడంతో ఆలస్యం అయ్యిందని పోలీసులు వివరాలు సేకరించారు. సౌదీ అరేబియాకు చెందిన యాస్మిన్ అహమ్మద్ మూడేళ్ల క్రితం కేరళకు వచ్చింది.

పీస్ స్కూల్ లో టీచర్ ముసుగులో

పీస్ స్కూల్ లో టీచర్ ముసుగులో

మళప్పురంలోని పీస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో టీచర్ గా చేరింది. అక్కడే ఖురాన్ క్లాస్ లు చెబుతున్న రషీద్ తో ఆమెకు పరిచయం అయ్యింది. రషీద్ ఖురాన్ పాఠాలతో పాటు ఉగ్రవాదం నూరిపోశాడని యాస్మిన్ పోలీసులకు చెప్పిందని తెలిసింది.

పాఠాల ముసుగులో ఉగ్రవాదం

పాఠాల ముసుగులో ఉగ్రవాదం

ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రచురిస్తున్న మ్యాగజైన్ దబిక్ ను రషీద్ నిత్యం చదువుతూ ఉండేవాడని, యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి ఆన్ లైన్ ప్రచార సామాగ్రి ఉపయోగించే వాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

English summary
The recruiter identified as Yasmin Ahmad, a school teacher by profession, told police that an ISIS recruiter named Rashid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X