ఐఎస్ఐఎస్ మెహ్ది కేసు: కోర్టులో 36,986 పేజీల ఛార్జీషీట్
బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థలో చేరాలని యువతను ప్రోత్సహిస్తున్నాడని అరెస్టు అయిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు మెహ్ది మస్రూర్ బిశ్వాస్ అలియాస్ షమి విట్ నెస్ పై కేసు నమోదు చేసిన పోలీసులు 36,986 పేజీల చార్జ్ షీట్ న్యాయస్థానంలో సమర్పించారు.
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉంటున్న యువతను ట్విట్టర్ ద్వార మెహ్ది సంప్రదించాడని, వారిని ఐఎస్ఐఎస్ లో చేరాలని బ్రైన్ వాష్ చేశాడని బెంగళూరు పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ లో వివరాలు పోందుపరిచారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన మెహ్ది బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేసేవాడు.
ఇతను గుట్టు చప్పుడు కాకుండ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అమెరికా జాతీయుల తలలు ఏవిధంగా నరుకుతున్నారు అనే క్లిప్పింగ్ లను ట్విట్టర్ ద్వార షేర్ చేశాడు. అంతే కాకుండ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇస్లాం సామ్రాజ్యం కోసం పోరాడుతున్నారని కొనియాడాడు.

1,20,000 మందికి ఇతను ట్విట్టర్ ద్వారా ఆ నరరూపరాక్షసుల చేసిన అరాచకాలను షేర్ చేశాడు. విషయం పసిగట్టిన పోలీసులు గత డిసెంబర్ నెలలో బెంగళూరులో మెహ్దిని అరెస్టు చేశారు. అప్పటి నుండి కేసు విచారణ చేసిన పోలీసులు పలు ఆదారాలు సేకరించి ఎఫ్ఐఆర్ తయారు చేశారు.
మెహ్ది మీద తయారు చేసిన ఎఫ్ఐఆర్ లోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ట్విట్టర్ ఐపీ అడ్రస్ లాగ్ లు 10 పేజీలు
ట్విట్టర్ లో మెహ్ది చేసిన ట్విట్ లు 10,880 పేజీలు
దర్యాప్తు చేసిన అధికారులు సేకరించిన ఆదారాలు 1,451 పేజీలు
ట్విట్టర్ లో ఉపయోగించిన ఫోటోలు 15,446 పేజీలు
ఐఎస్ఐఎస్ మద్దతుదారులతో చేసిన చాటింగ్ 855 పేజీలు
దర్యాప్తు సమయలో చిక్కిన ఆదారాలు 2,023 పేజీలు
మొబైల్ ఫోన్ లో సంభాషణ, ఈ మెయిల్ చాట్ 5,545 పేజీలు
మెహ్ది ల్యాప్ టాప్, కంప్యూటర్, మొబైల్ ఫోన్ లను అధికారులు ఇప్పటికే సీజ్ చేసి అందులోని సమాచారం సేకరించి ఎఫ్ఐఆర్ లో పోందుపరిచారు.












Click it and Unblock the Notifications