మోడీ హత్యకు యత్నించాం: ఎన్ఐఏ అదుపులోని ఐఎస్ ఉగ్రవాదులు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐఎస్ ఉగ్రవాదుల మరో కుట్ర వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం భారత ప్రధాని నరేంద్ర మోడీ.. లక్నోలో ర్యాలీ జరిపిన వేళ, ఆయన్ను హత్య చేసేందుకు రాంలీలా మైదానంలో ప్రయత్నించామని ఉగ్రవాదులు చెప్పినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాన్ని వెల్లడించింది.

మధ్యప్రదేశ్ లో ఉజ్జయిన్ పాసింజర్ రైలులో పేలుడు జరిపిన ఉగ్రవాదులే మోడీని హత్య చేసేందుకు విఫలయత్నం చేశారని అధికారులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఉగ్రవాదులు మహ్మద్ డానిష్, ఆతిఫ్ ముజఫర్ తదితరులను విచారించగా, రాంలీలా మైదానంలో దసరా ఉత్సవాలకు ఒక రోజు ముందు అక్కడ పడివున్న ఓ
చెత్తడబ్బాలో వీరు బాంబును కూడా అమర్చారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

ISIS Module Made Failed Bid to Target PM Modi's Lucknow Rally: NIA

ఆపై రెండు రోజుల తరువాత ఆతిఫ్ ముజఫర్ అక్కడికి వెళ్లి చూడగా, బాంబు మాయమై వైర్లు మాత్రమే కనిపించాయి. దీంతో, ఆ తరువాత కూడా డానిష్ పలు చోట్ల బాంబులను పేల్చి ఐఎస్ఐఎస్ సత్తాను చాటాలని భావించి విఫలయ్యారని తెలిపారు. వీరు స్టీలు
పైపులు, షాండ్లియర్ బల్బులను వాడి బాంబులు చశారని, వీరికి భారత వాయుసేన మాజీ ఉద్యోగి సహకరించాడని ఎన్ఐఏ పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The ISIS-inspired terror module, allegedly involved in the Ujjain train blast, had made a failed bid to carry out an explosion at Prime Minister Narendra Modi's rally in Lucknow on Dussehra last year, according to NIA probe reports.
Please Wait while comments are loading...