ఎల్లుండి దాడి చేస్తాం, దమ్ముంటే అడ్డుకోండి: ఆదిత్యనాథ్‌కు 'ఐసిస్' లేఖ!

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) తీవ్రవాదుల నుంచి హెచ్చరికలు వచ్చినట్లుగా తెలుస్తోంది. బుధవారం నాడు ఐసిస్ పేరిట ఓ బెదిరింపు లేఖ వచ్చింది.

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) తీవ్రవాదుల నుంచి హెచ్చరికలు వచ్చినట్లుగా తెలుస్తోంది. బుధవారం నాడు ఐసిస్ పేరిట ఓ బెదిరింపు లేఖ వచ్చింది.

యూపీలోని వారణాసి జిల్లాలో ఈ లేఖ లభ్యమైంది. ఇందులో హిందీలో రాసి ఉంది. పూర్వాంచల్‌లో ఈ నెల 24వ తేదీన దాడులు జరుపుతామని అందులో చెప్పారు. అందులో పాకిస్తాన్‌ను ప్రశంసిస్తూ నినాదాలు రాశారు.

ISIS warns of attack in Eastern UP, letter recovered from Varanasi

'పాకిస్తాన్ జిందాబాద్, 23-03-2017 రోజు పూర్వాంచల్‌లో దాడులు చేస్తాం. దమ్ముంటే ఎల్లుండి మేం జరిపే హింసను అడ్డుకోండి' అని రాసి ఉంది.

వారణాసి నుంచి ప్రధాని మోడీ ఎంపీగా ఉన్నారు. స్వయంగా ఆయన నియోజకవర్గం నుంచి లేఖ రావడం గమనార్హం. ఈ లేఖపై పోలీసులు సీరియస్‌గా ఆరా తీస్తున్నారు. లేఖకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+