• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇస్రో ఛైర్మన్ శివన్ కన్నీరు..ప్రధాని ఓదార్పు: భుజం..వెన్ను తట్టి :నెటిజెన్ల ప్రశంసలు ..!!

|
  శివన్ ను ఓదార్చిన ప్రధాని మోదీ || The Internet Got Teary-Eyed Watching Modi Hug ISRO Chief Sivan

  చంద్రయాన్ -2 ప్రయోగం చివరి దశలో ఏర్పడిన లోపంతో ఉద్వేగ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇస్రో ఛైర్మన శివన్ కన్నీరు పెట్టుకున్నారు. ఊహించని విధంగా ప్రధాని స్పందించారు. కన్నీటి పర్యంతమైన శివన్ ను ప్రధాని హత్తుకొని ఓదార్చారు. భుజం.. వెన్ను తట్టి ధైర్యం చెప్పారు. భారతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారని.. వారి కుటుంబాలకు తమ సెల్యూట్‌ చేసారు. ఇదెంత మాత్రం వెనుకడుగు కానే కాదని.. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు గర్వపడుతున్నామని మోదీ పేర్కొన్నారు.

  చరిత్రలో నిలిచిపోయే ప్రయోగం .. భవిష్యత్ అద్భుతాలకు సంకేతం చంద్రయాన్ 2

  ఇక..ఇస్రో శాస్త్రవేత్తలకు పౌరులు పెద్ద ఎత్తున ప్రశంసలతో ముంచెత్తారు. వ్యాఖ్యానించారు. చంద్రుడిపై ఉపగ్రహాన్ని పంపించేందుకు నాసా పదిసార్లు ప్రయత్నించి విఫలమైందని, కాని మన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ ను చంద్రుడికి అత్యంత సమీపకక్ష దాకా వెళ్లిందంటూ అభినందనలతో ముంచెత్తారు.

  ISRO chairman Sivan emotional on last minute problem in Chandrayaan-2

  శివన్ కన్నీరు..ప్రధాని భుజం తట్టి...

  ప్రతిష్ఠాత్మకంగా భావించిన చంద్రయాన్ -2 ప్రయోగం చివరి దశలో ఏర్పడిన లోపంతో ఇస్రో ఛైర్మన్ శివన్ కన్నీటీ పర్యంతమయ్యారు. భారత ప్రధాని మోదీ వెంటనే స్పందించారు. అక్కడే ఉన్న ఆయన శివన్ ను హత్తుకున్నారు. ఓదార్చారు. శివన్ భుజం.. వెన్ను తట్టి ధైర్యం చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి ఘట్టంలో ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ తెగిపోవడంతో శివన్ తో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. నిరాశపడిన ఇస్రో ఛైర్మన్ శివన్‌తోపాటు శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ వారి అంకిత భావాన్ని..

  సమర్ధతను అభినందించారు. దేశం పట్ల శాస్త్రవేత్తలకు ఉన్న నిబద్ధత ఎంతో గర్వించదగిందన్నారు. చంద్రుడికి మనం దగ్గరగా వెళ్లామని.. భవిష్యత్‌లో మనం మరిన్ని ప్రయోగాలు చేయాలన్నారు. ఇదెంత మాత్రం వెనుకడుగు కానే కాదని.. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు గర్వపడుతున్నామని మోదీ పేర్కొన్నారు. మీరు సంతోషించే మరెన్నో అవకాశాలు మున్ముందు వస్తాయన్నారు. ఈ రోజు మనకు ఎదురైన పాఠాలు... మనల్ని మరింత ధృఢంగా తీర్చిదిద్దుతాయన్నారు. ప్రతి సమస్య మనకు కొత్త విషయాలను నేర్పుతుందన్నారు. సాధించిన ఫలితాలతోపాటు... సాగించిన కృషి కూడా గుర్తించాలన్నారు. చంద్రయాన్‌-2 విషయంలో శాస్త్రవేత్తలు గొప్ప ప్రయత్నం చేశారని ప్రసంశించారు. సైన్స్‌లో ఫెయిల్యూర్‌ అనే మాటే లేదన్నారు. మన విజయాలకు భారీ కొలమానాలు పెట్టుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

  నెటిజెన్ల ప్రశంసలు..సెల్యూట్

  ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా తిలకించిన చంద్రయాన్‌-2కు ఆఖరి కణాల్లో అవరోధం ఏర్పడటంతో నిరాశ చెందిన ఇస్రో శాస్త్రవేత్తలకు నెటిజన్లు బాసటగా నిలిచారు. వారి సమర్ధతను కీర్తించారు. చంద్రుడిపై ఉపగ్రహాన్ని పంపించేందుకు నాసా పదిసార్లు ప్రయత్నించి విఫలమైందని, కాని మన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ ను చంద్రుడికి అత్యంత సమీపకక్ష దాకా వెళ్లిందని నెటిజన్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. స్రో శాస్త్రవేత్తలు రాకెట్ శాస్త్ర సైన్సులో దేశం గర్వపడేలా ప్రయత్నాలు చేసిందని మరో నెటిజన్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయం చంద్రయాన్-2 ప్రయోగమని భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించవచ్చని జై హింద్ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. చంద్రయాన్ -2 మిషన్ 93 శాతం విజయం సాధించిందని, చివరి 2.1 కిలోమీటర్ల దూరం దాకా వెళ్లి ఆగిపోయిందని ఓ ట్విట్టర్ యూజర్ వ్యాఖ్యానించారు. ఇస్రో శాస్త్రవేత్తలను సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందనలు..ప్రశంసలతో వారికి అండగా నిలుస్తూ.. మద్దతు ప్రకటించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  isro chairman Sivan emotional on last minute problem in Chandrayan-2. PM Modi Hug Sivan and given appreciation on scientists efforts. In social media netizens supported ISRO effort.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more