చందమామపై కాలనీని నిర్మించేది ఇక్కడే!
చందమామ దక్షిణ ధృవానికి దగ్గర్లోని అయిట్కెన్ బేసిన్ లో కాలనీని నిర్మించాలని నాసా , చైనా ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాజాగా ఇస్రో అడుగులు కూడా అటువైపే పడుతున్నాయి. అయిట్కెన్ బేసిన్ అనేది... అతి పెద్ద గొయ్యి. మన భాషలో చెప్పాలంటే భారీగా పగుళ్లిచ్చిన లోయ లాంటిది. 2500 కిలోమీటర్ల వ్యాసార్థం ఉంటుంది. చందమామ ఉపరితలం నుంచి 8.2 కిలోమీటర్ల లోతు ఉంది. భవిష్యత్తులో చందమామపై మనుషులు జీవించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనిలోనే లోయలు, పర్వతాలు ఉన్నాయి. సూర్యుడి రేడియేషన్ నుంచి మనుషుల్ని కాపాడేది కూడా ఇవే.
భూమి నుంచి అయిట్కెన్ బేసిన్‌ను చూస్తే కొంతే కనిపిస్తుంది. చందమామకు అవతలివైపు ఉండటమే దీనికి కారణం. సౌర కుటుంబంలో అతి పెద్ద పగులు లోయల్లో ఇది కూడా ఒకటి. చందమామపై అత్యంత లోతైన లోయ ఇదే. దాదాపు 420 కోట్ల సంవత్సరాల నాటదని భావిస్తున్నారు. భూమి ఏర్పడిన సమయంలోనే ఈ లోయ కూడా ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

చైనా స్పేస్‌క్రాఫ్ట్ ఛేంజ్ 4 2019 జనవరి 3న.. అయిట్కెన్ బేసిన్‌లో దిగింది. ఆ లోయలో భారీ ఎత్తున ఖనిజాలు ఉన్నాయని, మరింత లోతుకు ఉన్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయిట్కెన్ బేసిన్‌లో భారీగా ఐరన్, టైటానియం, థోరియం నిల్వలున్నాయని నాసా అంచనా వేస్తోంది. అక్కడే ఇనుముతో ఉన్న సున్నపురాతి చెరువులున్నాయి. కాలనీని నిర్మించేందుకు అవసరమైన మెటీరియల్ మొత్తం ఈలోయలోనే ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఇక్కడ ఒక కాలనీని నిర్మించుకోవచ్చని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డెస్టినేషన్ మూన్ వీడియోలో తెలిపింది.
బేసిన్ లో గుండ్రంగా ఉన్న రిమ్‌లో పర్వతాలు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. వాటిపై ఎప్పుడూ ఎండ ఉంటుంది. ఈ కారణంతో అక్కడ కాలనీని నిర్మించుకోవచ్చని ESA చెబుతోంది. త్వరలో రోవర్లు, ఆ తర్వాత మనుషుల్ని అక్కడికి పంపాలని ఈఎస్ ఏ భావిస్తోంది.












Click it and Unblock the Notifications