Chandrayaan 3 : చంద్రుడిపై ల్యాండర్, రోవర్ ను నిద్రలేపేది అప్పుడే-ఇస్రో కీలక ప్రకటన..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా ఉన్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లను అక్కడి సూర్యోదయం నేపథ్యంలో పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇవాళ జరగాల్సిన ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇస్రో వాయిదా ప్రకటన మాత్రమే విడుదల చేసింది. కారణాలు వెల్లడించలేదు.

ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ దీనిపై స్పందిస్తూ.. ఇంతకుముందు తాము సెప్టెంబర్ 22 సాయంత్రం ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌ను తిరిగి యాక్టివేట్ చేయాలని అనుకున్నామని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు దాన్ని సెప్టెంబర్ 23న చేపట్టనున్నట్లు వెల్లడించారు. అంటే ఇవాళ శుక్రవారం జరగాల్సిన ఈ కార్యక్రమం కాస్తా రేపటికి ఇస్రో వాయిదా వేసుకుందన్న మాట.

Isro postpones plans to revive Chandrayaan 3s Vikram and Pragyan on moon

చంద్రుడిపై శివశక్తి పాయింట్ గా పిలుస్తున్న ప్రదేశంలో ఆగస్టు 23న విజయవంతంగా ల్యాండ్ అయిన మిషన్ లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజుల క్రితం అక్కడ రాత్రి కావడంతో నిద్రలోకి జారుకున్నాయి. చంద్రుడిపై ఒక్క రోజుగా, భూమిపైన 14 రోజులుగా భావించే సమయంలో పూర్తి నిష్క్రియాశీలంగా ఉన్న ఈ రెండూ.. ఇప్పుడు సెప్టెంబర్ 23న తిరిగి సక్రియం కానున్నాయి.

చంద్రుని ఉపరితలంపై ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 సాయంతో విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన తర్వాత రోవర్ , ల్యాండర్‌లను ఈ నెల ప్రారంభంలో స్లీప్ మోడ్‌లోకి పంపారు. రోవర్‌ను సెప్టెంబర్ 2న స్లీప్ మోడ్‌లోకి, ఆ తర్వాత సెప్టెంబర్ 4న ల్యాండర్‌ను పంపారు. వాటి కార్యాచరణ దశలో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అనేక ప్రయోగాలను నిర్వహించాయి. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై 100 మీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేసింది.

అలాగే దక్షిణ ధ్రువం దగ్గర చంద్రుని ఉపరితలంలో సల్ఫర్ ఉనికిని కనుగొంది. విక్రమ్ ల్యాండర్ దక్షిణ ధ్రువ ప్రాంతంలోని చంద్రుడి ప్లాస్మా వాతావరణానికి సమీపంలో ఉన్న కొలతలు కూడా వేసింది. ఇస్రో మొదట రోవర్ 300-350 మీటర్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల రోవర్ ఇప్పటి వరకు 105 మీటర్లు మాత్రమే కదిలింది. అయినప్పటికీ, మిషన్ దాని లక్ష్యాలను అందుకుంది. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై హాప్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది భవిష్యత్తులో చంద్రుని మిషన్లు , మానవ అన్వేషణకు ఓ భారీ విజయంగా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+