ఇక మరింత చౌక: ఏటీవీని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో
నెల్లూరు: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 6గంటలకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ లాంచ్ వెహికిల్(ఏటీవీ)-02 నింగిలోకి దూసుకెళ్లింది. శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని ఉదయం 6 నుంచి 10గంటల్లోగా పూర్తి చేయాలని ముందుగా నిర్ణయించారు.
కానీ, వాతావరణం అనుకూలించడంతో ఉదయం 6గంటలకే ప్రయోగం చేపట్టారు. ఏటీవీ రాకెట్ కేవలం ఇంధనం మాత్రమే తీసుకెళ్లి భూ వాతావరణంలోని ప్రాణవాయువు తీసుకుని ఇగ్వేషణ్ ప్రక్రియ కొనసాగించింది. కాగా, గతంలో ఇంధనం మండించేందుకు అమోనియం క్లోరేట్స్ ఆక్సిజన్ వినియోగించేవారు.

రాకెట్‌లోని మొదటి దశ 70 కి.మీ ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత కూస్టింగ్ దశలో రాకెట్ సెకనుకు 2కి.మీ వేగంతో నింగిలోకి వెళ్లింది. శాస్త్రవేత్తలు రాకెట్‌లోని రామ్‌జెట్ ఇంజిన్‌ను 5సెకన్లపాటు పరీక్షించారు. ఏటీవీని పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
కాగా, ఈ ప్రయోగంతో భవిష్యత్తులో రాకెట్ ప్రయోగాల వ్యయం తగ్గనుంది. భవిష్యత్‌లో బరువైన రాకెట్లను నింగిలోకి ప్రయోగించే అవకాశముంది. ఇస్రో అధిపతి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలిపారు. కాగా, ఇస్రో సంచాలకులు, డా.శివన్, కున్హికృష్ణన్ తదితరులు ప్రయోగాన్ని పర్యవేక్షించారు.












Click it and Unblock the Notifications