హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్తర ధృవం వద్ద గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటుకు ఇస్రో కసరత్తు

|
Google Oneindia TeluguNews

భూమి ఉత్తర ధృవం దగ్గర చైనా రెండేళ్ల క్రితమే గ్రౌండ్ స్టేషన్‌ను ప్రారంభించింది. ఇదే క్రమంలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా ఉత్తర ధృవం దగ్గర గ్రౌండ్ స్టేషన్ ప్రారంభించాలని యోచిస్తోంది. ఇక్కడ గ్రౌండ్ స్టేషన్‌ ప్రారంభమయ్యాక... ముందుగా రిమోట్ సెన్సింగ్ ఆపరేషన్స్ ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ సేవలు ప్రారంభించడం ద్వారా పౌర సేవలే కాకుండా అంటే విపత్తు నిర్వహణ అంచనాలే కాకుండా...భద్రతా బలగాలకు కూడా ఉపయోగపడుతుంది.

భూమి పరిశీలక ఉపగ్రహాలతో ఇస్రో ఐఆర్ఎస్ ప్రోగ్రాం రూపొందించింది. సమాచారం సేకరించి, ప్రాసెస్ చేసి డేటా వ్యాప్తి చేసి రాబోవు విపత్తును అంచనా వేసి ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో చెప్పే బాధ్యత హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం తీసుకుంటుంది. అయితే ఉత్తర ధృవం వద్ద ఒక గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన మాత్రం ఇస్రో సీరియస్‌గా చేస్తోంది. అయితే ఇది వాస్తవ రూపం దాల్చాలంటే ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటుకు పలు అంతర్జాతీయ అనుమతులతో పాటు ఆయా దేశాల సహకారం కూడా కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఇస్రో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

ఉత్తర ధృవంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేయడం కష్టతరమని... అక్కడ హార్డ్‌వేర్ ఎక్విప్‌మెంట్ ఇన్స్‌స్టాల్ చేయడం కూడా చాలా కష్టమని ఒక శాస్త్రవేత్త తెలిపారు. మరోవైపు దక్షిణ ధృవం దగ్గర గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేయడం దీనితో పోలిస్తే సులభమేనని అన్నారు.

 ఇతర దేశాల అవసరతలను తీరుస్తున్న షాద్‌నగర్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం

ఇతర దేశాల అవసరతలను తీరుస్తున్న షాద్‌నగర్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం

గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు ఎందుకు ఉపయోగమో మరో శాస్త్రవేత్త వివరించారు. ఐఆర్‌ఎస్‌కు సంబంధించి హై రిజుల్యూషన్ శాటిలైట్ ప్రోగ్రాంలో చాలా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చినందున గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటులో చాలా ఇబ్బందులు అధిగమించాల్సి ఉందని ఆయన తెలిపారు. హై రిజల్యూషన్ ఉపగ్రహాలు స్పష్టమైన విజువల్స్ ఇచ్చేందుకు ప్రాసెసింగ్ పవర్ పెద్ద ఎత్తున అవసరమవుతుందని చెప్పారు. ఉపగ్రహంలోని డేటా స్టోరేజ్ కెపాసిటీ, స్టోర్ చేయబడి గ్రౌండ్ స్టేషన్‌కు పంపాల్సిన ఇమేజ్‌కు సంబంధించిన డేటా డౌన్‌లింక్‌లాంటివి ఇటు భారత అవసరాలతో పాటు ప్రపంచదేశాల అవసరాలను కూడా తీర్చగలిగినదై ఉండాలన్నారు.

ప్రస్తుతం ప్రపంచ దేశాల అవసరాలను షాద్‌నగర్‌లో 2011లో ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్ఎస్‌సీ, IMGEO,2013లో అంటార్టికాలోని AGEOS‌లు తీరుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇస్రో మాత్రం 14 ఆర్బిట్ కవరేజ్ కోసం ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా ఉత్తర ధృవంలోని ఏ గ్రౌండ్ స్టేషన్‌ ప్రధానమో తెలుస్తుంది. ఇలా చేయడం ద్వారా ఉపగ్రహ కక్ష్య నుంచి పూర్తి సమాచారం అందుతుంది. దీంతో ప్రతి కక్ష్యలో సమాచారం సేకరించి వెంటనే షాద్‌నగర్‌కు చేరవేయడం జరుగుతుంది.

అంటార్టికాలో వచ్చే ఏడాది రెండో యాంటెన్నా

అంటార్టికాలో వచ్చే ఏడాది రెండో యాంటెన్నా

మరోవైపు అంటార్కిటికాలోని AGEOS వద్ద రెండో డేటా రిసెప్షన్ యాంటెన్నాను ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని కారణాల చేత దాన్ని వచ్చే ఏడాది ఏర్పాటు చేయనున్నారు. భారతి స్టేషన్‌లో ఉన్న AGEOS, అంటార్కిటికాలోని లార్స్‌మెన్ హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన యాంటెన్నాలకు ఐఆర్ఎస్ సమాచారం రిసోర్స్ శాట్-2 రిశాట్-2, కార్టోశాట్ ఉపగ్రహ కుటుంబం, సరాల్ నుంచి సమాచారం పొంది అది షాద్‌నగర్‌లోని రిమోట్ సెన్సింగ్ కేంద్రానికి బదిలీ చేస్తున్నాయి.

అధిక సమాచారం కోసం రెండో యాంటెన్నా

అధిక సమాచారం కోసం రెండో యాంటెన్నా

ఇప్పటికే ఒక యాంటెన్నా ఉండగా రెండో యాంటెన్నా ఏర్పాటు చేయడం ద్వారా అది కార్టోశాట్-3, 2022లో నింగిలోకి పంపనున్న నిస్సార్ ప్రాజెక్టు నుంచి సమాచారం సేకరించేందుకే వినియోగించనున్నారు. నిస్సార్ ప్రాజెక్టు వ్యయం 1.5 బిలియన్ డాలర్లు. ఇది రెండు ఫ్రీక్వెన్సీలపై ఆపరేట్ అవుతుంది. రెండు ఫ్రీక్వెన్సీలు కేయూ బ్యాండ్ లేదా ఏఏ బ్యాండ్‌లోపే ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరో వైపు ఎస్‌-బ్యాండ్ రాడార్‌ను 12 సెంటిమీటర్ల వేవ్‌లెంగ్త్‌తో ఇస్రో తయారు చేయనుంది. నాసా ఎల్-బ్యాండ్ రాడార్ కోసం 24 సెంటీమీటర్లున్న వేవ్‌లెంగ్త్‌ను సమకూర్చనుంది. ఇస్రో లాంచ్ వెహికల్‌ను కూడా సమర్పించనుంది. అంటార్కిటికాలోని రెండో టెర్మినల్ స్టేషన్ షాద్‌నగర్‌లోని కేంద్రానికి ఫాలోఆన్ కేంద్రంగా వ్యవహరిస్తుంది.

English summary
Indian Space Research Organisation (ISRO) plans to set up its first overseas ground station at the North Pole. This would bolster the Indian Remote Sensing (IRS) operations which are critically important in times like disaster management but also for the armed forces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X