గోవిందా గోవిందా, చిన్నమ్మ రూ. 1,500 కోట్ల బినామీ ఆస్తులు సీజ్, అమ్మ ఆసుపత్రిలో ఉంటే !
చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే. జయలలిత నెచ్చలి వీకే శశికళ అలియాస్ చిన్నమ్మకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద వీకే. శశికళకు చెందిన రూ. 1, 500 కోట్ల అక్రమ ఆస్తులను ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు జప్తు (సీజ్) చేశారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు (రూ. 1,000, రూ. 500 నోట్లు) తరువాత జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే వీకే. శశికళ రూ. 1,500 కోట్లకు పైగా అక్రమాస్తులు కొనుగోలు చేశారని గుర్తించిన అధికారులు ఆ ఆస్తులను సీజ్ చేశారు.

జయలలిత అపోలో ఆసుపత్రిలో !
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీవ్ర ఆనారోగ్యానికి గురైన జయలలిత 2016 సెప్టెంబర్ 22వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేశారు. చికిత్స విఫలమై డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించారు. అదే సమయంలో వీకే. శశికళ చెన్నై, కోయంబత్తూరు, పుదుచ్చేరీ తదితర ప్రాంతాల్లో అక్రమాస్తులు కొనుగోలు చేశారని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు.

ప్రాణ స్నేహితురాలి ప్రాణాలు !
జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే వీకే. శశికళ అక్రమాస్తులు కొనుగోలు చేసి తన ఇల్లు చక్కపెట్టుకోవడానికి ప్రయత్నించారని ఆదాయపన్ను శాఖ అధికారులు అంటున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని అన్నాడీఎంకే పార్టీ నాయకులు, అప్పటి తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంతో సహా అందరూ అపోలో ఆసుపత్రి దగ్గరే దేవుడిని ప్రార్థిస్తున్నారు. అలాంటి సమయంలో అపోలో ఆసుపత్రి నుంచి చక్రం తిప్పిన శశికళ వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు కొనుగోలు చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

శశికళకు బిగిసిన ఉచ్చు
బినామీ ఆస్తుల నిషేధం చట్టం కింద వీకే. శశికళకు చెందిన రూ. 1,500 కోట్ల బినామీ ఆస్తులు జప్తు కావడంతో ఆమె చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. శశికళ బినామీ ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి పత్రాలను సంబంధిత అధికారులకు పంపించామని ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు.

2017లో 150 చోట్ల ఐటీ దాడులు
ఆదాయినికి మించిన అక్రమాస్తులు సంపాధించారని ఆరోపిస్తూ నమోదైన కేసులో 2017 ఫిబ్రవరిలో వీకే. శశికళను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. ఆపరేషన్ క్లీన్ మనీ పేరుతో 2017 నవంబర్ నెలలో ఆదాయపన్ను శాఖ అధికారులు చెన్నై, కోయంబత్తూరు, పుదుచ్చేరి, బెంగళూరు, హైదరాబాద్ తదితర 150 చోట్ల అధికారులు దాడులు చేసి శశికళకు చెందిన బినామీ ఆస్తులు గుర్తించారు.

పని మనుషులు, డ్రైవర్ల పేరుతో ఆస్తులు
ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న బినామీ ఆస్తులు శశికళ ఇంటి పని మనుషులు, కారు డ్రైవర్లు, పీఏల పేర్ల మీద ఉన్నాయని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. తన పేరుతో అక్రమాస్తులు ఉంటే మొదటికే మోసం వస్తోందని భయంతో శశికళ చాల మంది బినామీ పేర్లతో అక్రమాస్తులు సంపాధించారని అధికారులు గుర్తించారు. శశికళ అక్రమాస్తులు దాదాపుగా ఆమె పేరుతో లేవని అధికారులు తెలిపారు.

జయలలిత ఇంటిలో !
చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలోని శశికళ గదుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. అక్కడ చిక్కిన విలువైన పత్రాల్లో శశికళ బినామీ ఆస్తుల వివరాలు ఉన్నాయని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. జయలలిత ఇంటిలో చిక్కిన పత్రాల్లోని వివరాల ఆధారంగా చెన్నైలోని పెరంబదూరులోని గంగా ప్రతిష్టానలోని సైక్ట్రమ్ మాల్, పుదుచ్చేరిలోని శ్రీ లక్ష్మి జుబెలరి పేరులో ఉన్న రెసార్టులో, కోయంబత్తూరులోని సెంథిల్ పేపర్ అండ్ బోర్డ్స్ తదితర చోట్ల, 37 ప్రాంతాల్లోని 150 చోట్ల సోదాలు చెయ్యడంతో శశికళలకు చెందిన రూ. 1.500 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగు చూశాయని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications