వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనూ సూద్‌ నివాసాలపై ఐటీ దాడులు, కేజ్రీవాల్ ఏం అన్నారంటే.. - ప్రెస్‌రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సోనూ సూద్‌

సినీ నటుడు సోనూ సూద్‌ నివాసం, కార్యాలయాల్లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

''పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, లఖ్‌నవూ నగరాల్లోని సూద్‌కు చెందిన ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిపామని అధికారులు తెలిపారు.

'లఖ్‌నవూలోని ఓ స్థిరాస్తి సంస్థతో సూద్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ సర్వే ఆపరేషన్‌ నిర్వహించా’అని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు.

ఇటీవల సోనూసూద్‌.. దిల్లీ 'ఆప్‌’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఆ సమయంలో ఆప్‌ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీ దాడులపై ఆప్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సోనూసూద్‌కు మద్దతుగా నిలిచింది.

కరోనా సమయంలో లక్షలాది కుటుంబాలకు సూద్‌ సాయం చేశారని.. వారంతా ఆయన కోసం ప్రార్థిస్తారని, ఈ కష్టకాలంలో మద్దతుగా నిలుస్తారని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌తో సమావేశమైనందుకే ఈ దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను బీజేపీ ఖండించింది’’అని ఈనాడు తెలిపింది.

అత్యాచారాలు

యువతిపై దాడి చేస్తూ వీడియో చిత్రీకరణ

''తనను దూరంగా ఉంచిన యువతిని ఓ వ్యక్తి చిత్రహింసలకు గురిచేస్తూ... ఆ వ్యవహారాన్ని వీడియో తీయించాడు. ఆ వీడియో బుధవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు’’అని సాక్షి తెలిపింది.

''ఈ కేసులో గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. నెల్లూరు రామకోటయ్యనగర్‌కు చెందిన పల్లాల వెంకటేష్, కె.శివకుమార్‌ స్నేహితులు. వెంకటేష్‌ టిప్పర్‌ డ్రైవర్‌. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య అతనిని విడిచి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో వెంకటేష్‌ ఓ యువతితో సన్నిహితంగా ఉండేవాడు. అయితే అతని ప్రవర్తన నచ్చక ఆమె అతనిని దూరంగా ఉంచుతూ వచ్చింది. దీనిని అతను జీర్ణించుకోలేకపోయాడు.

సుమారు మూడు నెలల కిందట మాట్లాడుకుందామని యువతిని కొత్తూరు సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తించాడు. కర్రతో, చేతులతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. గాజులు పగిలి రక్తస్రావం అవుతున్నా కనికరించలేదు. బాధిత యువతి తనను వదిలేయాలని కన్నీటి పర్యంతమైనా పట్టించుకోకుండా దాడి చేస్తూ ఆ వ్యవహారాన్ని స్నేహితుడు శివకుమార్‌ ద్వారా వీడియో తీయించాడు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

మూడు నెలల అనంతరం బుధవారం వాట్సాప్, ట్విట్టర్, పలు చానళ్లలో యువతిని చిత్రహింసలు పెడుతున్న వీడియో వైరల్‌ అయింది. దీనిపై ఎస్పీ విజయారావు స్పందించి.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

సాంకేతికత సాయంతో వీడియోలోని నిందితులను గుర్తించి, తెగచర్లలో వారిని అరెస్ట్‌ చేశారు. నిందితులిద్దరిపై రౌడీషీట్లు తెరుస్తున్నట్టు ఎస్పీ తెలిపారు’’అని సాక్షి తెలిపింది.

కెల్విన్‌, జీషాన్‌అలీ పార్టీల్లో తెలుసు- డ్రగ్స్ కేసు విచారణలో ముమైత్ ఖాన్

స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో కొన్ని పార్టీల్లో తాను పాల్గొన్నానని, డ్రగ్స్‌ కేసుల్లో నిందితులైన కెల్విన్‌, జీషాన్‌ అలీ అక్కడే తెలుసునని, అయితే వారితో తనకు ఆర్థిక సంబంధాలు లేవని ఈడీ అధికారులకు సినీనటి ముమైత్‌ ఖాన్‌ చెప్పారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

''టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ముమైత్‌ విచారణకు హాజరయ్యారు. తన బ్యాంక్‌ ఖాతాల స్టేట్‌మెంట్‌లను అధికారులకు ఆమె సమర్పించారు.

ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విచారణ కొనసాగింది. 7 గంటల పాటు ముమైత్‌ను ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసులో కీలక నిందితులైన కెల్విన్‌, జీషాన్‌ అలీతో గల ఆర్థికసంబంధాలపై విచారించారు.

తన బ్యాంక్‌ స్టేట్‌మెంట్లలోని అనుమానాస్పద లావాదేవీలపై ఆమె నుంచి వివరణ తీసుకున్నారు. కాగా, ముమైత్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి ఎఫ్‌-క్లబ్‌కు నగదు బదిలీ అయినట్లుగా ఈడీ గుర్తించింది. అవి పార్టీలకు సంబంధించిన లావాదేవీలేనని ఆమె వివరణ ఇచ్చారు.

ఇప్పటికే ముమైత్‌ ఖాన్‌ సహా పూరి జగన్నాథ్‌, చార్మికౌర్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రానా దగ్గుబాటి, నందు, రవితేజ, ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌, ఎఫ్‌-క్లబ్‌ జీఎంను ఈడీ ప్రశ్నించింది. ఇక తనీశ్‌, తరుణ్‌ మిగిలి ఉన్నారు. తనీశ్‌ గురువారం విచారణకు హాజరుకానున్నారు. 22న తరుణ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తారు’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

మిర్జీ బజ్జి

మిర్చి బజ్జీ గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

గొంతులో మిర్చి బజ్జి ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుందని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

''హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మల్లేశ్(40) మంగళవారం రాత్రి తన సొంత గ్రామమైన మిజ్జిల్‌కు వచ్చాడు.

రాత్రి ఇంటి మిద్దెపై కూర్చోని హోటల్ నుంచి తెచ్చుకున్న మిర్చి తింటుండగా మిర్చి గొంతుకు అడ్డుపడడంతో మృతి చెందాడు.

తెల్లవారుజామున కుటుంబ సభ్యులు మిద్దె పైకి వెళ్లేసరికి మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు.

హైదరాబాద్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
IT attacks on Sonu Sood's residences, what Kejriwal said- Press Review
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X