సినీ పరిశ్రమపై ఐటీ దాడులు... రూ.200 కోట్ల బ్లాక్ మనీ గుర్తింపు
ఆదాయపు పన్నుశాఖ ఇటీవల తమిళనాడు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లల్లో దాడు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.200 కోట్ల బ్లాక్ మనీని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. ఈనెల రెండోతేదీ నుంచి కలైపులి థాను, ఎస్ ఆర్ ప్రభు, అన్బుసెళియన్ తదితరుల కార్యాలయాల్లో మూడురోజులపాటు అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నై, మధురై, కోయంబత్తూరు లోని 40 చోట్ల ఈ తనిఖీలు జరిగాయి. రూ.26 కోట్ల నగదు, రూ.3 కోట్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

వీటితోపాటుగా రూ.200 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. లెక్కల్లో వెల్లడించని ఈ ఆదాయానికి సంబంధించిన కీలక పత్రాలు, డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. సినిమాల విడుదల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తక్కువగా చూపించినట్లు గుర్తించారు. థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లు భారీ సంఖ్యలో డబ్బులు వసూలుచేసి వాటిని కూడా లెక్కల్లో చూపించలేదని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అన్బుసెళియన్ పై అధికారులు దృష్టిసారించారు. ఆయనకు చెందిన పలు ప్రాంతాల్లోని కార్యాలయాలపై సోదాలు జరిగాయి. బంధువులు, సన్నిహితుల నివాసాల్లో కూడా సోదించారు. ఆయన నిర్మించిన కబాలి, అసురన్, కర్ణన్ సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. సూర్య బంధువైన మరో నిర్మాత ఎస్ ఆర్ ప్రభు గతంలో కార్తి నటించిన ఖైదీ, సూర్య నటించిన ఎన్ జీకే సినిమాలను నిర్మించారు.












Click it and Unblock the Notifications