చెన్నై సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు శుభవార్త, ఇంటిలోనే ఉండండి, కానీ, భారీ వర్షాలకు ఐటీ కంపెనీలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: చెన్నై, నగర శివార్లలోని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న వారికి శనివారం ఆ కంపెనీల యాజమాన్యం తీపి కబురు చెప్పింది. భారీ వర్షాల కారణంగా మీరు ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోం) చెయ్యాలని శనివారం పలు సాఫ్ట్ కంపెనీల యాజమాన్యం ఆ సంస్థల ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది.

గత కొన్ని రోజులుగా చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని సముద్ర తీరప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై నగరంతో సహ తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 17 మంది మరణించారు. చెన్నై నగరంలో ఇద్దరు వర్షం నీటిలో అదుపుతప్పి డ్రైనేజ్ లో కొట్టుకుపోయి మరణించారు.

IT Companies are requested their Employees to avail Work from home

సాఫ్ట్ వేర్ కంపెనీలు, ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇంటి నుంచి పని చెయ్యడానికి అవకాశం కల్పించాలని, లేదంటే సెలవులు ప్రకటించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మనవి చేశారు. చెన్నై నగరం జలమయం కావడంతో ఎలాంటి ప్రాణహానీ జరకుండా చూడాలని ప్రభుత్వం మనవి చేసింది.

చెన్నైలో వర్షం ఆగకపోవడంతో పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు, కార్పొరేటర్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఎలాంటి హానీ జరకుండా చూడాలని శనివారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. వర్షాలు తగ్గితే కార్యాలయాలకు రావాలని, లేదంటే ఇంటి నుంచి పని చెయ్యాలని చల్లటి కబురు చెప్పడంతో పలువురు టెక్కీలు, కార్పొరేట్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IT Companies are requested their Employees to avail Work from home option because of heavy rain lash in the city.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి